అధికారులపై కన్ను వేయండి " చంద్రబాబు
“పార్టీలో రోజు రోజుకి ఏదో జరుగుతోంది. ఎక్కడో ఏదో లోపం కనబడుతోంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి అధికారులు కూడా సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకులు అందరూ అధికారుల కదలికల పైన కన్ను వేయాలి” ఇదీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలు. గత నెల రోజులుగా తెలుగుదేశం […]
“పార్టీలో రోజు రోజుకి ఏదో జరుగుతోంది. ఎక్కడో ఏదో లోపం కనబడుతోంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి అధికారులు కూడా సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకులు అందరూ అధికారుల కదలికల పైన కన్ను వేయాలి” ఇదీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలు.
గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. రాజకీయాలలో పార్టీ వదిలి మరో పార్టీలో చేరడం అనేది పాత సంప్రదాయమే. అయితే పార్టీ ఓటమి ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఆవేదన చెందుతున్నట్లు సమాచారం.
రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించదు అనే ప్రచారానికి ప్రభుత్వ అధికారులు కూడా సహకరిస్తున్నారని పార్టీ సీనియర్ నాయకుల వద్ద అనుమానం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో, భారతీయ జనతా పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేస్తున్నాయో బయటకు రానివ్వడం లేదని, దీని వెనుక అధికారుల ప్రమేయం ఉందని చంద్రబాబు నాయుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు వంటి అంశాలపై ఆరా తీయాలని ఆదేశించినట్టు చెబుతున్నారు.