Telugu Global
NEWS

ఈసారి వామపక్షాలతో కలుద్దాం....

“పరిస్థితి ఏం బాగోలేదు. వాతావరణం అనుకూలించడం లేదు. అన్ని వైపుల నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. అందరు మనల్నే టార్గెట్ చేస్తున్నారు. పోనీ, ఈసారి వామపక్షాలతో కలిసి వెళ్దామా?.” ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఆలోచన. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో, పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్లిన తెలుగుదేశం పార్టీకి ఈసారి ఆ రెండు పార్టీలు శత్రువులు గా మారాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ రోజురోజుకు బల పడుతున్నట్లుగా […]

ఈసారి వామపక్షాలతో కలుద్దాం....
X

“పరిస్థితి ఏం బాగోలేదు. వాతావరణం అనుకూలించడం లేదు. అన్ని వైపుల నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. అందరు మనల్నే టార్గెట్ చేస్తున్నారు. పోనీ, ఈసారి వామపక్షాలతో కలిసి వెళ్దామా?.” ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఆలోచన.

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో, పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్లిన తెలుగుదేశం పార్టీకి ఈసారి ఆ రెండు పార్టీలు శత్రువులు గా మారాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ రోజురోజుకు బల పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత స్నేహాన్ని తిరిగి కొనసాగించడానికి, పవన్ కళ్యాణ్ తో మాట్లాడడానికి ఓవైపు ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరోవైపు తన పాత మిత్రులైన సిపిఐ, సిపిఎం పార్టీలతో కూడా మాట్లాడాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు వారిద్దరూ సీట్ల పంపిణీ అంశం పై కూడా చర్చించు కుంటున్నారు. ఈ దశలో వారితో పాటు తెలుగుదేశం పార్టీ కూడా చేతులు కలిపితే తనకు లాభిస్తుందని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

ఇదే విషయమై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతోనూ, వామపక్షాలకు చెందిన జాతీయ నాయకులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో కలవడం సిపిఐ, సిపిఎం పార్టీల రాష్ట్ర నాయకులకు ఇష్టం లేదు అంటున్నారు.

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తనకున్న జాతీయస్థాయి పరిచయాలతో పాత స్నేహాన్ని తిరిగి కొనసాగించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు వామపక్షాలకు చెందిన జాతీయ నాయకులతో మాట్లాడినట్లు చెబుతున్నారు.

సిపిఐ, సిపీఎం జాతీయ నాయకులైన సీతారాం ఏచూరి, సురవరం సుధాకర రెడ్డి లతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన వామపక్ష నాయకులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఒకవేళ వామపక్షాలు కూడా తనతో కలిస్తే పవన్ కల్యాణ్ కూడా తమతో కలుస్తారనే ఆలోచన చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు చెబుతున్నారు.

First Published:  20 Feb 2019 3:07 PM IST
Next Story