Telugu Global
Cinema & Entertainment

సుప్రియతో అడివి శేషు పెళ్లి.... క్లారిటీ ఇచ్చిన హీరో!

టాలీవుడ్ లో మరో పెళ్లి రూమర్ హల్ చల్ చేస్తోంది. నటుడు నాగార్జున మేనకోడలు, నటి సుప్రియతో హీరో అడివి శేష్ పెళ్లి జరుగబోతోందన్న వార్త వైరల్ అవుతోంది. హీరో సుమంత్ సోదరి సుప్రియ. అడివి శేష్, సుప్రియల వివాహం సుమంతే చేయబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ పై తాజాగా అడివి శేష్ కూడా స్పందించారు. ఇప్పుడు తన దృష్టంతా సినిమాల మీదనే ఉందంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం నా జీవితంలో సినిమాలు […]

సుప్రియతో అడివి శేషు పెళ్లి.... క్లారిటీ ఇచ్చిన హీరో!
X

టాలీవుడ్ లో మరో పెళ్లి రూమర్ హల్ చల్ చేస్తోంది. నటుడు నాగార్జున మేనకోడలు, నటి సుప్రియతో హీరో అడివి శేష్ పెళ్లి జరుగబోతోందన్న వార్త వైరల్ అవుతోంది. హీరో సుమంత్ సోదరి సుప్రియ. అడివి శేష్, సుప్రియల వివాహం సుమంతే చేయబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

అయితే ఈ రూమర్స్ పై తాజాగా అడివి శేష్ కూడా స్పందించారు. ఇప్పుడు తన దృష్టంతా సినిమాల మీదనే ఉందంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం నా జీవితంలో సినిమాలు చేయడం తప్పా మరోక ఆలోచన లేదు. యాక్టింగ్, రైటింగ్…. ఇలా నా ఆశయాలను, కలలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా పని నేను చేసుకుంటూ కష్టపడుతున్నా. ఇది తప్పా ఇంకో ఆలోచన లేదంటూ శేష్ వివరణ ఇచ్చారు.

ఇక అడవి శేషు నటించిన గూఢచారి మూవీలో సుప్రియ ఓ కీలక పాత్రలో యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో శేష్ బిజీగా ఉన్నారు. పవన్ కల్యాణ్ సరసన అక్కడ అమ్మాయి…ఇక్కడ అబ్బాయి మూవీలో సుప్రియ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు సుప్రియా.

తన మేనమామ నాగార్జునతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ పనులు చూస్తోంది. అయితే అడవి శేష్, సుప్రియల వివాహానికి సంబంధించి వస్తున్న రూమర్స్ ఎంత వరకు నిజమో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

First Published:  20 Feb 2019 7:14 AM IST
Next Story