కేబినెట్ విస్తరణపై ఫిర్యాదు... క్లారిటీ ఇచ్చిన ఈసీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది.. దీంతో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన కేబినెట్ విస్తరణను నిలిపివేయాలని టీ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఆయన తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కు ఫోన్ చేశారు. తన ఫిర్యాదును కమిషనర్ కు వివరించారు. దీంతో రజత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ విస్తరణ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది.. దీంతో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన కేబినెట్ విస్తరణను నిలిపివేయాలని టీ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఆయన తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కు ఫోన్ చేశారు. తన ఫిర్యాదును కమిషనర్ కు వివరించారు. దీంతో రజత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.
కేబినెట్ విస్తరణ ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదన్నారు. మంగళవారం తలపెట్టిన కేబినెట్ విస్తరణను యథాతథంగా చేపట్టవచ్చని స్పష్టం చేశారాయన.