చంద్రబాబును కలిసిన చీరాల వైసీపీ ఇన్‌చార్జ్
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరిన నేపథ్యంలో టీడీపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న యడం బాలాజీకి గాలం వేసింది. ఇందులో భాగంగా బాలాజీ చంద్రబాబును కలిశారు. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే చీరాలలో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను కరణం బలరాంకు అప్పగించిన చంద్రబాబు… ఇప్పుడు యడం బాలాజీని కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆమంచిని వైసీపీలో చేర్చుకోవడాన్ని యడం బాలాజీ తప్పుపట్టారు. వైసీపీ కార్యకర్తలను ఇంతకాలం వేధించిన వ్యక్తిని ఇప్పుడు ఎలా పార్టీలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. […]
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరిన నేపథ్యంలో టీడీపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న యడం బాలాజీకి గాలం వేసింది. ఇందులో భాగంగా బాలాజీ చంద్రబాబును కలిశారు. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
ఇప్పటికే చీరాలలో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను కరణం బలరాంకు అప్పగించిన చంద్రబాబు… ఇప్పుడు యడం బాలాజీని కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆమంచిని వైసీపీలో చేర్చుకోవడాన్ని యడం బాలాజీ తప్పుపట్టారు.
వైసీపీ కార్యకర్తలను ఇంతకాలం వేధించిన వ్యక్తిని ఇప్పుడు ఎలా పార్టీలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ఆమంచి వైసీపీలోకి వచ్చిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో యడం బాలాజీకి టికెట్ దక్కే అవకాశం లేదు. దాంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.