ఉగ్రదాడిపైనా రాజకీయం మొదలుపెట్టిన చంద్రబాబు
పుల్వామా ఉగ్రదాడిపై దేశం మొత్తం రగిలిపోతోంది. ఈ దాడి వెనుక ముమ్మాటికి పాకిస్థాన్ హస్తముందన్నది జగమెరిగిన సత్యం. కానీ అమర జవాన్ల శవాలపైనా ఓట్లు వేరుకునేందుకు దేశంలో నేతలు బయలుదేరారు. తొలుత ఈ అంశానికి రాజకీయ రంగు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పూశారు. కేంద్రానికి తెలిసే జవాన్లపై దాడి జరిగిందని… సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ దాడి జరిగిందని… దీని ఆధారంగా రాజకీయ ప్రయోజనాల కోసం పాక్‌పై కేంద్రం పరోక్ష యుద్ధం మొదలుపెడుతోంది అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆమె అలా అనగానే చంద్రబాబు […]
పుల్వామా ఉగ్రదాడిపై దేశం మొత్తం రగిలిపోతోంది. ఈ దాడి వెనుక ముమ్మాటికి పాకిస్థాన్ హస్తముందన్నది జగమెరిగిన సత్యం. కానీ అమర జవాన్ల శవాలపైనా ఓట్లు వేరుకునేందుకు దేశంలో నేతలు బయలుదేరారు. తొలుత ఈ అంశానికి రాజకీయ రంగు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పూశారు.
కేంద్రానికి తెలిసే జవాన్లపై దాడి జరిగిందని… సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ దాడి జరిగిందని… దీని ఆధారంగా రాజకీయ ప్రయోజనాల కోసం పాక్‌పై కేంద్రం పరోక్ష యుద్ధం మొదలుపెడుతోంది అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆమె అలా అనగానే చంద్రబాబు అందుకున్నారు.
ఆమె వ్యాఖ్యలకు మరింత రాజకీయ రంగు పులిమారు. ఏదీ నేరుగా తన మీద వేసుకునే ధైర్యం చేయని చంద్రబాబు… కేంద్రానికి తెలిసే ఉగ్రదాడి జరిగిందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారని సన్నాయినొక్కులు నొక్కారు. అంతటితో ఆగకుండా ఉగ్రదాడి కూడా మోడీనే చేయించారేమో అన్న అనుమానాలు కలిగేలా… మోడీ ఏమైనా చేయగలడని వ్యాఖ్యానించారు.
గోద్రాలోనూ మోడీ ఇలాగే చేశాడని చంద్రబాబు చెప్పారు. గోద్రా ఘటనను, పుల్వామా ఉగ్రదాడికి లింక్ చేయడం ద్వారా తన కవి హృదయం ఏంటో అర్థమయ్యేలా చేసేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. అమాయకులు ఎవరైనా ఉంటే ఉగ్రదాడి కూడా మోడీనే చేయించాడేమో అని భావించాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా కనిపిస్తోంది. అంతే నమ్మినోళ్లు మనోళ్లు… నమ్మనోళ్లు
ఏమనుకుంటే మనకేం…. ఇదేగా చంద్రబాబు సిద్ధాంతం అంటున్నారు.