పాకిస్తాన్ పౌరులు వెంటనే నగరం విడిచి వెళ్లిపోవాలి : బికనీర్ కలెక్టర్
పూల్వామా ఉగ్రదాడి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు ఎంఎఫ్ఎన్ హోదాను రద్దు చేసిన భారత్.. దిగుమతులపై 200 శాతం సుంకాన్ని విధించింది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ పౌరులపై ఆంక్షలు విధించింది. రాజస్థాన్‌లోని బికనీర్ నగరానికి పాకిస్తాన్ నుంచి వర్తకులు, పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. బికనీర్ జిల్లా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ను ఆనుకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో బికనీర్ జిల్లా కలెక్టర్ పాకిస్తాన్ పౌరుల కోసం ఒక ఉత్తర్వు జారీ చేశారు. నగరంలో పాకిస్తాన్ […]
పూల్వామా ఉగ్రదాడి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు ఎంఎఫ్ఎన్ హోదాను రద్దు చేసిన భారత్.. దిగుమతులపై 200 శాతం సుంకాన్ని విధించింది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ పౌరులపై ఆంక్షలు విధించింది.
రాజస్థాన్‌లోని బికనీర్ నగరానికి పాకిస్తాన్ నుంచి వర్తకులు, పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. బికనీర్ జిల్లా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ను ఆనుకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో బికనీర్ జిల్లా కలెక్టర్ పాకిస్తాన్ పౌరుల కోసం ఒక ఉత్తర్వు జారీ చేశారు. నగరంలో పాకిస్తాన్ పౌరులు ఉండటానికి వీల్లేదని…. హోటళ్లు, లాడ్జీలు, గృహాల్లో పాకిస్తాన్ పౌరులకు చోటు ఇవ్వొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పాకిస్తాన్‌లో రిజిస్టర్ అయిన సిమ్ కార్డులు కూడా బికనీర్ జిల్లాలో వాడొద్దని.. జిల్లాలోని పౌరులు ఎవరూ పాకిస్తానీయులతో వ్యాపార, సన్నిహిత సంబంధాలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. రెండు నెలల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు.
అయితే విదేశాంగ శాఖ, జిల్లా పరిపాలన శాఖ వద్ద అనుమతులు తీసుకున్న పాకిస్తానీయులకు మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేశారు.