వెయ్యేసి పత్రికల్లో పండుగ చేసుకుంటున్న చంద్రబాబు
అన్నదాత సుఖీభవ పథకంలో కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలుపుకుని 15 వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు… ఆ మొత్తాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు. తొలి విడతగా విడుదల చేసిన సొమ్మును చూసి రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. తొలి విడతగా చంద్రబాబు ప్రభుత్వం జస్ట్ వెయ్యిరూపాయలు జమ చేసింది. అంటే వృధ్థాప్య పించన్ లో సగం అన్న మాట. రైతుల ఖాతాలో వెయ్యి రూపాయల జమ కోసం 488 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. మరీ వెయ్యి రూపాయలేనా అని రైతులు ఆశ్చర్యపోతుంటే…. ప్రభుత్వం ప్రచారంలో […]
అన్నదాత సుఖీభవ పథకంలో కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలుపుకుని 15 వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు… ఆ మొత్తాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు. తొలి విడతగా విడుదల చేసిన సొమ్మును చూసి రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు.
తొలి విడతగా చంద్రబాబు ప్రభుత్వం జస్ట్ వెయ్యిరూపాయలు జమ చేసింది. అంటే వృధ్థాప్య పించన్ లో సగం అన్న మాట.
రైతుల ఖాతాలో వెయ్యి రూపాయల జమ కోసం 488 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. మరీ వెయ్యి రూపాయలేనా అని రైతులు ఆశ్చర్యపోతుంటే…. ప్రభుత్వం ప్రచారంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు.
ప్రముఖ పత్రికల్లో బ్యానర్ ఐటమ్‌గా ప్రచురించుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. అదేదో సినిమాలో అలీకి బ్రహ్మానందం చిల్లరేసి పండుగ చేసుకో అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని రైతులు విమర్శిస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయలను తీసుకోవాలన్నా తాము బ్యాంకుల చుట్టూ రెండుమూడు రోజులు తిరగాల్సి ఉంటుందని.. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే రోజు కూలీ కూడా గిట్టుబాటు కాదని మండిపడుతున్నారు.
15వేలు ఇస్తామంటున్న చంద్రబాబు తొలి విడతలో వెయ్యి రూపాయలు వేశారంటే…. మొత్తం డబ్బు ఎన్ని విడతల్లో వేస్తారో…. ఎన్ని ఏళ్లు పడుతుందో అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.