రాష్ట్రం రక్షించబడాలంటే ఈసారి టీడీపీ ఓడాల్సిందే " పీఠాధిపతి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. రాష్ట్రంలో అవినీతి, అరాచకం కట్టలు తెంచుకుందని ఆందోళన చెందారు. ప్రభుత్వ పెద్దలు దారి తప్పి పాలన సాగించడం వల్లే వర్షాలు కూడా కురవడం లేదన్నారు. ఇలాంటి పాలనకు పంచభూతాలు కూడా సహకరించవన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారితేనే రాష్ట్రం బాగుపడుతుందని, ప్రజలు సుఖంగా ఉంటారని స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మారాలన్న ఉద్దేశంతో రాజశ్యామల యాగం చేస్తున్నట్టు చెప్పారు. రాజు సక్రమంగా ఉంటే రాష్ట్రం సుఖంగా ఉంటుందని… కానీ రాజే అవినీతిపరుడైతే […]
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. రాష్ట్రంలో అవినీతి, అరాచకం కట్టలు తెంచుకుందని ఆందోళన చెందారు. ప్రభుత్వ పెద్దలు దారి తప్పి పాలన సాగించడం వల్లే వర్షాలు కూడా కురవడం లేదన్నారు.
ఇలాంటి పాలనకు పంచభూతాలు కూడా సహకరించవన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారితేనే రాష్ట్రం బాగుపడుతుందని, ప్రజలు సుఖంగా ఉంటారని స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మారాలన్న ఉద్దేశంతో రాజశ్యామల యాగం చేస్తున్నట్టు చెప్పారు.
రాజు సక్రమంగా ఉంటే రాష్ట్రం సుఖంగా ఉంటుందని… కానీ రాజే అవినీతిపరుడైతే రాజ్యం కరువుకాటకాలు, ప్రకృతి
వైపరీత్యాలతో అల్లాడుతుందన్నారు. టీడీపీ పాలనలో చివరకు వెంకటేశ్వరస్వామి ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు.
టీటీడీ ఆస్తులపై చంద్రబాబు, ఆయన అనుచరుల అకృత్యాలకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. త్వరలోనే కేసు కూడా వేస్తానని స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు.