Telugu Global
National

స్టెరిలైట్ ప్లాంట్ మూసే ఉంచండి : సుప్రీంకోర్టు

తమిళనాడులో వివాదాస్పదంగా మారిన స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌ను మూసే ఉంచాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. విపరీతమైన కాలుష్యాన్ని వెలువరిస్తున్న ఈ ప్లాంటును మూసేయాలంటూ గత ఏడాది జరిగిన నిరసన హింసకు దారి తీసిన విషయం తెలిసిందే. స్థానికుల నుంచి వచ్చిన నిరసనల తర్వాత తమిళనాడు ప్రభుత్వం ప్లాంటుకు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో స్టెరిలైట్ ప్లాంటును యాజమాన్యమైన వేదాంత గ్రూప్ తాత్కాలికంగా మూసేసి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)ని ఆశ్రయించింది. స్టెరిలైట్ ప్లాంటును తిరిగి తెరువవచ్చని ఎన్జీటీ […]

స్టెరిలైట్ ప్లాంట్ మూసే ఉంచండి : సుప్రీంకోర్టు
X

తమిళనాడులో వివాదాస్పదంగా మారిన స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌ను మూసే ఉంచాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. విపరీతమైన కాలుష్యాన్ని వెలువరిస్తున్న ఈ ప్లాంటును మూసేయాలంటూ గత ఏడాది జరిగిన నిరసన హింసకు దారి తీసిన విషయం తెలిసిందే.

స్థానికుల నుంచి వచ్చిన నిరసనల తర్వాత తమిళనాడు ప్రభుత్వం ప్లాంటుకు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో స్టెరిలైట్ ప్లాంటును యాజమాన్యమైన వేదాంత గ్రూప్ తాత్కాలికంగా మూసేసి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)ని ఆశ్రయించింది. స్టెరిలైట్ ప్లాంటును తిరిగి తెరువవచ్చని ఎన్జీటీ తీర్పిచ్చింది. ఈ తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. ఎన్జీటీకి ఈ ప్లాంటు విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదని, ఇది వారి పరిధి కాదని హెచ్చరించింది. స్టెరిలైట్ ప్లాంటును తెరుచుకోవాలంటే వేదాంత గ్రూప్ మద్రాస్ హైకోర్టులో అనుమతుల కోసం ప్రయత్నించవచ్చని సుప్రీం చెప్పింది.

స్టెరిలైట్ ప్లాంట్ వల్ల భూగర్భజలాలు కలుషితం అవ్వడమే కాకుండా స్థానికులు పలు రకాల వ్యాదులకు గురవుతున్నారు. అందుకే ఆ ప్లాంట్ మూసేయాలని ఉద్యమాలు జరిగాయి.

First Published:  18 Feb 2019 7:30 AM IST
Next Story