Telugu Global
NEWS

హరీష్‌రావుకు అందుకే పదవి ఇవ్వట్లేదు

తెలంగాణలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి మరి కొన్ని గంటలే సమయం ఉంది. ఇప్పటికే ఎవరెవరికి పదవులు ఇస్తున్నారో వారిని ప్రగతి భవన్ కు పిలిపించుకొని సీఎం కేసీఆర్ మాట్లాడారు. అయితే ఒకప్పుడు టీఆర్ఎస్‌లో నెంబర్ టూగా ఉన్న హరీష్ రావుకు మాత్రం మంత్రివర్గంలో మొండి చెయ్యి చూపించారు. హరీష్‌కు మంత్రిగా స్థానం కల్పించకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వివరించారు. హరీష్ రావు గత కొంత కాలంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు […]

హరీష్‌రావుకు అందుకే పదవి ఇవ్వట్లేదు
X

తెలంగాణలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి మరి కొన్ని గంటలే సమయం ఉంది. ఇప్పటికే ఎవరెవరికి పదవులు ఇస్తున్నారో వారిని ప్రగతి భవన్ కు పిలిపించుకొని సీఎం కేసీఆర్ మాట్లాడారు. అయితే ఒకప్పుడు టీఆర్ఎస్‌లో నెంబర్ టూగా ఉన్న హరీష్ రావుకు మాత్రం మంత్రివర్గంలో మొండి చెయ్యి చూపించారు.

హరీష్‌కు మంత్రిగా స్థానం కల్పించకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వివరించారు. హరీష్ రావు గత కొంత కాలంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో ఫొన్ లో టచ్‌లో ఉన్నాడన్నారు. ఆయనతో హరీష్ జరిపిన సంభాషణల రికార్డులను స్వయంగా హరీష్ పీఏ సీఎం కేసీఆర్‌కు అందించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ముందు నుంచే కేసీర్, హరీష్ రావుకు దూరం పెరిగిందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ మధ్య హరీష్, కేసీఆర్ కలసిన సందర్భాలు కూడా తక్కువగానే ఉన్నాయి. వీటన్నింటికీ హరీష్ రావు తెర వెనుక నడుపుతున్న మంత్రాంగమే కారణమని రేవంత్ అంటున్నారు.

రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. కీలకమైన లోక్‌సభ ఎన్నికల ముందు కేసీఆర్ ముఖ్యనాయకుడిని ఇందుకే పక్కన పెట్టాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

First Published:  18 Feb 2019 12:56 PM IST
Next Story