గల్లా జయదేవ్‌పై టీడీపీ ఎంపీ సెటైర్లు....
రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం తప్ప మిగిలిన సామాజిక వర్గాలన్నీ చంద్రబాబు హయాంలో నష్టపోయాయన్నారు టీడీపీ ఎంపీ రవీంద్రబాబు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన రవీంద్రబాబు… వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల వారు ఏకమై కుక్కకాటుకు చెప్పు దెబ్బ తరహాలో సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కులాల వారీగా చంద్రబాబు వద్ద ఆర్మీ ఉందని విమర్శించారు. ఏ కులం వారిని ఆ కులం వారితోనే తిట్టిస్తారన్నారు. తాను చంద్రబాబుపై విమర్శలు చేసిన నేపథ్యంలో […]
రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం తప్ప మిగిలిన సామాజిక వర్గాలన్నీ చంద్రబాబు హయాంలో నష్టపోయాయన్నారు టీడీపీ ఎంపీ రవీంద్రబాబు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన రవీంద్రబాబు… వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల వారు ఏకమై కుక్కకాటుకు చెప్పు దెబ్బ తరహాలో సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
కులాల వారీగా చంద్రబాబు వద్ద ఆర్మీ ఉందని విమర్శించారు. ఏ కులం వారిని ఆ కులం వారితోనే తిట్టిస్తారన్నారు. తాను చంద్రబాబుపై విమర్శలు చేసిన నేపథ్యంలో తిరిగి తనను విమర్శించేందుకు దళితులనే చంద్రబాబు ఎగదోస్తారన్నారు. చంద్రబాబును నమ్మి దళిత సోదరులు మోసపోవద్దన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసమే తాను టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరినట్టు చెప్పారు. వైసీపీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీలో దళిత ఎంపీల పట్ల చిన్నచూపు ఉందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయిందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినందుకే చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేశారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వల్ల కొద్దికాలం బీజేపీని, మరికొద్దికాలం కాంగ్రెస్‌ను పొగడాల్సి వచ్చిందని… ఈ పరిస్థితి చూసి సిగ్గేసిందన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు వల్ల కలిగే ఉపయోగం లేనే లేదన్నారు. ఏపీలో కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి అన్ని కట్టబెడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చింది చంద్రబాబేనన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. టీడీపీలో కులవివక్ష చాలా ఉందని… చివరకు లోక్‌సభలో మాట్లాడే విషయంలోనూ కుల వివక్ష చూపించారన్నారు. చంద్రబాబు సామాజికవర్గం వారు మాట్లాడితే మీడియాలో ఆకాశానికెత్తారని గుర్తు చేశారు. లోక్‌సభలో మాట్లాడే అవకాశం కూడా ఒక సామాజికవర్గం ఎంపీలకు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రజలంతా ఏకమై చంద్రబాబును గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రత్యేక హోదా సాధించే శక్తి ఒక్క జగన్‌కు మాత్రమే ఉందన్నారు. చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వచ్చారని.. వచ్చినప్పుడు ఎన్నిసార్లు జడ్జీలను కలిశారు, సొంత పనులను సరిపెట్టుకున్నారు అన్నది పక్కన పెడితే కేంద్ర మంత్రులను కలిసిన సమయంలో చంద్రబాబు లిస్ట్‌లో కోటిపల్లి- నర్సాపురం రైల్వే లైన్ డిమాండ్ మాత్రం ఉండేది కాదన్నారు. ఆ రైల్వే లైన్‌ను స్వయంగా తానే తిరిగి సాధించుకున్నానన్నారు. కానీ ఒక్క పేపర్‌లో కూడా తన గురించి రాయలేదన్నారు. దళితుడిని కాబట్టే తన గురించి పత్రికల్లో కూడా రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారన్నారు.
టీడీపీ అవినీతిలో కూరుకుపోయినా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా పనిచేసిన వ్యక్తిని తాను మాత్రమేనన్నారు. ఈసారి రాష్ట్రంలో వైసీపీకి తిరుగులేదన్నారు. 175 స్థానాల్లో 175 స్థానాలు వైసీపీనే గెలుస్తుందన్నారు.
పార్లమెంట్‌లో పేపర్ చూడకుండా ఏ భాషలోనైనా, ఏ సబ్జెక్ట్ పైనా అయినా సరే మాట్లాడే దమ్మున్న వ్యక్తిని తాను మాత్రమేనన్నారు. కానీ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సొంత సామాజికవర్గానికి చెందిన ఒక ఎంపీతో మాట్లాడించారని, అతడు పదో తరగతి పిల్లాడిలా పేపర్లు చూసి మిస్టర్ ప్రైమ్ మినస్టర్ అంటూ చదివిన దానికే విజయవాడ నుంచి గుంటూరు వరకు ఊరేగింపులు చేశారని రవీంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇదంతా కుల వివక్ష కాదా అని ప్రశ్నించారు.