పుల్వామాలో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు..
కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలోని పింగ్లన్‌లో ఒక ఇంట్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు ఇంటిని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. జమ్ము కశ్మీర్‌లో నాలుగో రోజూ కర్ప్యూ కొనసాగుతోంది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.

కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలోని పింగ్లన్‌లో ఒక ఇంట్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు ఇంటిని చుట్టుముట్టాయి.
ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు జవాన్లు ప్రాణాలు
కోల్పోయారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. జమ్ము కశ్మీర్‌లో నాలుగో రోజూ కర్ప్యూ కొనసాగుతోంది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.