Telugu Global
NEWS

సీనియర్ తమ్ముళ్లకు.... మొండిచెయ్యేనా.....

తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో పక్కా వ్యూహంతో వ్యవహరించాలని భావిస్తోంది. ఇందుకు నాందివాచకంగా ఈసారి ఎన్నికలలో సీనియర్లకు మొండిచేయి చూపాలని నిర్ణయించినట్లు సమాచారం. రెండురోజుల క్రితం జరిగిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో సూత్రప్రాయంగా దీనికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన పూర్తిస్దాయిలో విజయవంతం కావడంతో సీనియర్లను పక్కన పెట్టాలనే ఆలోచనకు కార్యరూపం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా […]

సీనియర్ తమ్ముళ్లకు.... మొండిచెయ్యేనా.....
X

తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో పక్కా వ్యూహంతో వ్యవహరించాలని భావిస్తోంది. ఇందుకు నాందివాచకంగా ఈసారి ఎన్నికలలో సీనియర్లకు మొండిచేయి చూపాలని నిర్ణయించినట్లు సమాచారం. రెండురోజుల క్రితం జరిగిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో సూత్రప్రాయంగా దీనికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

అయితే ఆదివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన పూర్తిస్దాయిలో విజయవంతం కావడంతో సీనియర్లను పక్కన పెట్టాలనే ఆలోచనకు కార్యరూపం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు చెబుతున్నారు. గడచిన నాలుగున్నారేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీలో అవినీతి విపరీతంగా పెరిగిందన్న ఆరోపణలకు కారణం పార్టీలోని సీనియర్‌ సభ్యలు, శాసనసభ్యులేనని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది.

పార్టీలో సీనియర్ నాయకులు కావడంతో అధికారులతోనూ వర్తక, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన వారితోను మంచి సంబంధాలు ఉంటాయని, వాటి ఆధారంగానే సీనీయర్ నాయకులు అవినీతికి అలవాటు పడిపోయారని చంద్రబాబు నాయుడు అంచన వేస్తున్నారట. తనకు అందిన సర్వేల ప్రకారం కూడా సీనియర్లకు టిక్కెట్లు ఇస్తే పార్టీ ఘోరంగా ఓడిపోతుందని అంటున్నారు. పైగా అనేక జిల్లాలలో నియర్ నాయకుల మధ్య విభేదాలు తారాస్దాయికి చేరుకున్నాయి. రానున్న ఎన్నికలలో సీనీయర్లను మార్చి కొత్తవారికి ముఖ్యంగా యువకులకు టిక్కెట్లు ఇస్తే మంచిదన్న అభిప్రాయం పోలిట్ బ్యూరోలో వ్యక్తం అయ్యిందంటున్నారు. మొత్తానికి రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సీనీయర్లకు మొండిచేయి చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

First Published:  18 Feb 2019 9:40 AM IST
Next Story