Telugu Global
NEWS

మిగతా కులాలకు దూరమవుతున్న చంద్రబాబు ?

నారా చంద్రబాబు నాయుడు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. రెండున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న నాయకుడు. రాజకీయాలలో కులం ప్రాధాన్యత ఎంత ఉంటుందో తెలిసిన నాయకుడు. మితిమీరిన విశ్వాసం, దెబ్బతిన్న వ్యూహ రచనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కుల రాజకీయాలపై ఎంతో పట్టు ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్కో కులానికి దూరం అవుతున్నారు. కాపు రిజర్వేషన్ కారణంగా ఆ కులస్తులు చంద్రబాబు పట్ల ఆగ్రహంగా ఉన్నారు. కాపు […]

మిగతా కులాలకు దూరమవుతున్న చంద్రబాబు ?
X

నారా చంద్రబాబు నాయుడు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. రెండున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న నాయకుడు. రాజకీయాలలో కులం ప్రాధాన్యత ఎంత ఉంటుందో తెలిసిన నాయకుడు. మితిమీరిన విశ్వాసం, దెబ్బతిన్న వ్యూహ రచనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

కుల రాజకీయాలపై ఎంతో పట్టు ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్కో కులానికి దూరం అవుతున్నారు. కాపు రిజర్వేషన్ కారణంగా ఆ కులస్తులు చంద్రబాబు పట్ల ఆగ్రహంగా ఉన్నారు. కాపు కులానికి చెందిన ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చినా… కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా చంద్రబాబు నాయుడుపై కాపులు మాత్రం అసహనంగా ఉన్నారు. జనాభా పరంగా బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులు తక్కువ గానే ఉన్నా వీరిలో ఎక్కువ శాతం మంది తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం గా ఉండేవారు.

గడచిన నాలుగు సంవత్సరాలలో ఈ మూడు కులాల పట్ల చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్నారని ఆ కులస్తులు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. బ్రాహ్మణులు తమని చంద్రబాబు నాయుడు అవమానించారనే కోపంతో ఉంటే…. కోమట్లు తమను పట్టించుకోలేదనే అలకతో ఉన్నారు. జనాభాలో అత్యంత తక్కువగా ఉండే క్షత్రీయులైతే తాము ఎప్పుడూ కూరలో కరివేపాకు లాంటి వారిమేననే నమ్మకంలో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ తమను కాస్తలో కాస్త పట్టించుకున్నా తెలుగుదేశం పార్టీ తమ వైపే చూడడం లేదనే కినుక వారిలో బలంగా ఉంది.

ఇక బీసీలు తమ పార్టీ వారే అని తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్లు ధీమాగా ఉంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీసీ గర్జన తో వారు కూడా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారని తేలిపోయింది.

చంద్రబాబు నాయుడు ఒక్కో కులానికి దూరం అవుతూనే… తన సొంత కులానికి మాత్రమే దగ్గరవుతున్నారని అంటున్నారు. దీని ప్రభావం రానున్న ఎన్నికల్లో చాలా ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

First Published:  18 Feb 2019 12:02 AM GMT
Next Story