Telugu Global
NEWS

జగన్ కు పెరిగిన బీసీ బలం

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. గడచిన పది రోజులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారు. అలా చేరిన వారు గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనూ, ప్రభుత్వం లో జరుగుతున్న అవినీతి, బంధుప్రీతి, స్వకుల ప్రేమ ఎంతో ఎక్కువయ్యాయి అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు, పార్టీ ఫిరాయింపు లతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు […]

జగన్ కు పెరిగిన బీసీ బలం
X

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. గడచిన పది రోజులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారు. అలా చేరిన వారు గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనూ, ప్రభుత్వం లో జరుగుతున్న అవినీతి, బంధుప్రీతి, స్వకుల ప్రేమ ఎంతో ఎక్కువయ్యాయి అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ఈ విమర్శలు, పార్టీ ఫిరాయింపు లతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు గోరు చుట్టు మీద రోకలి పోటు చందంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీసీ గర్జన సూపర్ సక్సెస్ కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

పది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ సదస్సు సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన బీసీలకు వరాల జల్లు పెద్దగా ప్రభావం చూపించలేదని అంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో జరిగిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన ఇందుకు తార్కాణమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఈ సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఆ పార్టీ పట్ల బీసీల్లో మరింత నమ్మకాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అన్ని కులాలను ఒకేలా చూస్తామని, విద్యార్థులు, యువకులు, మహిళలు, వృద్ధులు ఇలా అందరికీ చేయూతనిస్తామని జగన్ ప్రకటించడాన్ని సభకు హాజరైన బీసీలు స్వాగతిస్తున్నారని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు హయాంలో బీసీలకు జరిగిన మోసాన్ని విమర్శించడమే కాకుండా తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా జగన్ స్పష్టంగా చెప్పారని సభకు హాజరైన బీసీలు అంటున్నారు. వైసీపీ బీసీ గర్జనతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన పెరిగింది.

First Published:  17 Feb 2019 3:36 PM IST
Next Story