మహానాయకుడు ట్రయిలర్ లో మిస్టేక్స్
మహానాయకుడు ట్రయిలర్ పై ఇప్పటికే చాలా రచ్చ నడుస్తోంది. ట్రయిలర్ ఏమాత్రం బాగా లేదంటూ కామెంట్స్ పడుతున్నాయి. ఇప్పుడు దీనికి తోడు ఆ ట్రయిలర్ లో లోపాలు వెదికే పని కూడా మొదలైంది. అవును.. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2గా వస్తున్న మహానాయకుడు ట్రయిలర్ లో చాలా తప్పులున్నాయంటున్నారు నెటిజన్లు. వాటిలో ఒకటి గోడపై నిజమైన ఎన్టీఆర్ ఫొటో ఫ్రేమ్ తగిలించడం. ట్రయిలర్ లోని ఓ సన్నివేశంలో చంద్రబాబు పాత్రధారి రానా కనిపిస్తాడు. ఆ సన్నివేశంలో రానా బ్యాక్ […]
మహానాయకుడు ట్రయిలర్ పై ఇప్పటికే చాలా రచ్చ నడుస్తోంది. ట్రయిలర్ ఏమాత్రం బాగా లేదంటూ కామెంట్స్ పడుతున్నాయి. ఇప్పుడు దీనికి తోడు ఆ ట్రయిలర్ లో లోపాలు వెదికే పని కూడా మొదలైంది. అవును.. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2గా వస్తున్న మహానాయకుడు ట్రయిలర్ లో చాలా తప్పులున్నాయంటున్నారు నెటిజన్లు. వాటిలో ఒకటి గోడపై నిజమైన ఎన్టీఆర్ ఫొటో ఫ్రేమ్ తగిలించడం.
ట్రయిలర్ లోని ఓ సన్నివేశంలో చంద్రబాబు పాత్రధారి రానా కనిపిస్తాడు. ఆ సన్నివేశంలో రానా బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద ఎన్టీఆర్ అసలు ఫొటో కనిపిస్తుంది. సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తున్నాడు. లెక్కప్రకారం గోడపై ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలయ్య ఫొటో ఉండాలి. కానీ అసలైన ఫొటోనే తగిలించారు. ఆమాత్రం శ్రద్ధ లేకుండా సినిమా ఎలా తీశారంటూ క్రిష్ తో పాటు టోటల్ యూనిట్ పై కామెంట్స్ పడుతున్నాయి
మరోవైపు బయోపిక్ లో ఎన్టీఆర్ ను వయసుమళ్లిన గెటప్ లో, చేతికర్రతో చూపించిన క్రిష్.. సేమ్ టైం దగ్గుబాటి రాణా, వెన్నెల కిషోర్ పాత్రల్ని మాత్రం పార్ట్-1లో చూపించినట్టు అంతే యంగ్ గా చూపించడాన్ని తప్పుపడుతున్నారు నెటిజన్లు. వీటితో పాటు మరో 2-3 చిన్నచిన్న తప్పుల్ని కూడా సోషల్ మీడియాలో ఎత్తిచూపుతున్నారు. ఇప్పటికే ట్రయిలర్ పై వస్తున్న నెగెటివ్ రెస్పాన్స్ తో ఉక్కిరిబిక్కిరవుతున్న క్రిష్… ఈ మిస్టేక్స్ పై ఎలా స్పందిస్తాడో చూడాలి.