Telugu Global
NEWS

కారులో అసమ్మతి విస్తరణ

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిసి మూడు నెలలు దాటింది. కేవలం ఇద్దరంటే ఇద్దరు మాత్రమే మంత్రులు. వారిలో ఒకరు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మరొకరు మహమూద్ ఆలీ. వీరు మినహా ఇక ఎవ్వరిని మంత్రి పదవి వరించలేదు. అన్ని పదవులను తన వద్దే పెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 19 వ తేదీన తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తొలి విడతగా 12 మందికి మంత్రివర్గంలో చోటు […]

కారులో అసమ్మతి విస్తరణ
X

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిసి మూడు నెలలు దాటింది. కేవలం ఇద్దరంటే ఇద్దరు మాత్రమే మంత్రులు. వారిలో ఒకరు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మరొకరు మహమూద్ ఆలీ. వీరు మినహా ఇక ఎవ్వరిని మంత్రి పదవి వరించలేదు.

అన్ని పదవులను తన వద్దే పెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 19 వ తేదీన తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తొలి విడతగా 12 మందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. ఇది పైకి మంత్రివర్గ విస్తరణలా కనిపించినా అంతర్గతంగా మాత్రం పార్టీలో అసమ్మతి విస్తరణే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టపెట్టిన కె.చంద్రశేఖర రావు దానితో కాసింత అగ్గి రాజేశారని పార్టీలో చర్చ జరిగింది. అయితే ఆ అగ్గి మరింత రాజుకోకుండా ఉండేందుకు క్యాబినెట‌్ విస్తరణను కాసింత ఆలస్యం చేశారని తెలంగాణ భవన్ వర్గాలు అంటున్నాయి. శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి రావడం… బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి రాజ్యాంగపరమైన అంశాలను చేపట్టాల్సి రావడంతో ఇక అనివార్యంగా మంత్రివర్గ విస్తరణపై కె.చంద్రశేఖర రావు అడుగులు వేస్తున్నారని అంటున్నారు.

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. మంత్రి వర్గ కూర్పు విషయంలోనే పార్టీలో ఎలాంటి వివాదాలు తలెత్తుతాయో అని పార్టీ సీనియర్లు కంగారు పడుతున్నారు. ఇద్దరు ఎంపీలు మంత్రిపదవి మీద ఆశతో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. వారిద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా…? లేదా అన్నది వేచి చూడాలి..?

ఎన్నికల ముందు తన మేనల్లుడు హరీష్ రావు పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆ తర్వాత నీటి పారుదల విభాగంలో పనులు సరిగా జరగడం లేదంటూ మండిపడ్డారు. ఇది దేనికి సంకేతమని పార్టీలో చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన తుమ్మల నాగేశ్వర రావు ఓడిపోయారు. ఆయన స్ధానాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన పువ్వాడకు ఇస్తారా? అని ఊహాగానాలు వస్తున్నాయి. మరో సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ కు ఈ సారి మంత్రి పదవి దక్కుతుందా…? లేదా అన్నది కూడా మీమాంశగానే ఉంది.

ఇలా పార్టీలో సీనియర్లను పక్కన పెట్టి పదవుల పందారం చేపడితే కారులో అసమ్మతి గళం వినిపిస్తుంది అంటున్నారు. అయితే, దీని వల్ల ఇప్పటికిప్పుడు ఎలాంటి ముప్పు రాకపోయినా భవిష్యత్ లో మాత్రం ఇబ్బందులు వస్తాయని సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

First Published:  16 Feb 2019 10:54 PM GMT
Next Story