జనసేన పోటీ చేసేది వందలోపేనా ?
జనసేన. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెట్టిన రాజకీయ పార్టీ. గత ఎన్నికల సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో మాత్రం లేరు. ఆ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికారు. ఆ మద్దతుతోనే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తు అధికారంలోకి వచ్చింది. నాలుగున్నరేళ్ల చంద్రబాబు నాయుడి పాలనపై నిప్పులు చెరుగుతూ ఈ సారి ఎన్నికల బరిలో నిలుస్తామని, విజయం సాధించి […]
జనసేన. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెట్టిన రాజకీయ పార్టీ. గత ఎన్నికల సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో మాత్రం లేరు. ఆ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికారు. ఆ మద్దతుతోనే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తు అధికారంలోకి వచ్చింది.
నాలుగున్నరేళ్ల చంద్రబాబు నాయుడి పాలనపై నిప్పులు చెరుగుతూ ఈ సారి ఎన్నికల బరిలో నిలుస్తామని, విజయం సాధించి తీరుతామని ప్రకటించారు. అంతకు ముందు ఒకసారి తాము బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తామని ప్రకటించిన వపన్ కల్యాణ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతటా పోటీ చేస్తామని చెప్పారు.
ఇక పొత్తుల గురించి కూడా ఓ స్పష్టత ఇచ్చిన పవన్ కల్యాణ్ తాము వామపక్ష పార్టీలతోనే కలుస్తామని తేల్చేశారు. రానున్న ఎన్నికల్లో వామపక్షాలకు 40 స్ధానాలు ఇస్తారని వార్తలు కూడా వచ్చాయి. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అందరి కంటే ముందే తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం టిక్కెట్ కు అభ్యర్ధిని కూడా ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో ఎందుకో నెమ్మదించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రానున్న ఎన్నికల్లో వామపక్షాలకు 40 స్ధానాలు కేటాయిస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ తమ పార్టీ మాత్రం వంద లోపు స్ధానాలకే పరిమితమవుతుందని తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. తాను సేకరించిన సమాచారం, తనకు వచ్చిన నివేదికల ఆధారంగా జనసేన అభ్యర్ధులు 80 చోట్ల మాత్రమే బలంగా ఉన్నారని, మిగిలిన స్ధానాల్లో అంత బలంగా లేరని పవన్ కల్యాణ్ అన్నట్లు చెబుతున్నారు.
అంటే 175 స్ధానాలున్న ఆంధ్రప్రదేశ్ లో జనసేన, వామపక్షాలు కలిపి పోటీ చేసేది 120 నుంచి 130 వరకూ మాత్రమే ఉంటాయని అంటున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో 45 స్ధానాల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు ఉండవు. ఎన్నికలకు ముందే ఇన్ని స్ధానాలు వదులుకుంటే ఫలితాల తర్వాత జనసేనకు ఎన్ని మిగులుతాయన్నది ప్రశ్న.