Telugu Global
NEWS

ఏపీలో కాంగ్రెస్ పార్టీ టికెట్లకు బీభత్సమైన డిమాండ్ !

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే ఉత్సాహం ఉన్న వారి నుంచి దరఖాస్తులను కోరింది. ఇప్పటికే భారీగా అప్లికేషన్లు కూడా వచ్చాయట. దరఖాస్తు తేదీ ముగిసిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తూ అనేక మంది అప్లికేషన్లు పెట్టుకున్నట్టుగా ఏపీ కాంగ్రెస్ పార్టీ విభాగం ప్రకటించింది. పాతిక లోక్ సభ సీట్లకు గానూ నూటా తొంభై తొమ్మిది దరఖాస్తులు, నూటా డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లకు గానూ ఒక వెయ్యి నూటా ఆరవై ఒక్క దరఖాస్తులు వచ్చినట్టుగా కాంగ్రెస్ […]

ఏపీలో కాంగ్రెస్ పార్టీ టికెట్లకు బీభత్సమైన డిమాండ్ !
X

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే ఉత్సాహం ఉన్న వారి నుంచి దరఖాస్తులను కోరింది. ఇప్పటికే భారీగా అప్లికేషన్లు కూడా వచ్చాయట. దరఖాస్తు తేదీ ముగిసిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తూ అనేక మంది అప్లికేషన్లు పెట్టుకున్నట్టుగా ఏపీ కాంగ్రెస్ పార్టీ విభాగం ప్రకటించింది.

పాతిక లోక్ సభ సీట్లకు గానూ నూటా తొంభై తొమ్మిది దరఖాస్తులు, నూటా డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లకు గానూ ఒక వెయ్యి నూటా ఆరవై ఒక్క దరఖాస్తులు వచ్చినట్టుగా కాంగ్రెస్ ఏపీ విభాగం ప్రకటించింది. ఈ లెక్కన ప్రతి ఎంపీ సీటుకూ సగటున ఎనిమిది అప్లికేషన్లు వచ్చినట్టు. అదే ఎమ్మెల్యే టికెట్ల విషయానికి వస్తే ఈ సగటు కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. గత ఎన్నికలతోనే కాంగ్రెస్ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ లో కొద్దో గొప్పో మిగిలిన నేతలను కూడా ఇప్పుడు ఇతర పార్టీలు చేర్చేసుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అభ్యర్థులను నిలుపుకునే పరిస్థితుల్లో అయితే లేదు. అయితే తమకు బలం ఉందని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ టికెట్ల దరఖాస్తుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది.

అనేక మంది అనామకులు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ గా పని చేసిన అనుభవం లేని వారు కూడా..కాంగ్రెస్ టికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నట్టుగా సమాచారం. అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఇంత డిమాండ్ అని, ఇదంతా కేవలం ఏపీ కాంగ్రెస్ కమిటీ లీల అని పరిశీలకులు చెబుతున్నారు.

అప్లికేషన్లు భారీగా వచ్చాయని.. వాటిని ఢిల్లీకి పంపిస్తున్నట్టుగా హై కమాండ్ అభ్యర్థులను నిర్ణయిస్తుందని ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు.

First Published:  17 Feb 2019 12:30 PM IST
Next Story