ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి ఒలింపిక్స్ పతకాలు
టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ వినూత్న కార్యాచరణ 50 వేల టన్నుల వ్యర్థాల నుంచి 5 వేల స్వర్ణ, రజత, కాంస్యపతకాలు వాడిపడేసిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ల నుంచి బంగారు, వెండి, కంచు లోహాల సేకరణ వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా నిలిచే జపాన్…వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల కోసం ఓ వినూత్న పథకాన్ని చేపట్టింది. క్రీడల వేదిక టోక్యో నగరంలో గుట్టలుగుట్టలుగా పేరుకు పోయిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ […]
- టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ వినూత్న కార్యాచరణ
- 50 వేల టన్నుల వ్యర్థాల నుంచి 5 వేల స్వర్ణ, రజత, కాంస్యపతకాలు
- వాడిపడేసిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ల నుంచి బంగారు, వెండి, కంచు లోహాల సేకరణ
వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా నిలిచే జపాన్…వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల కోసం ఓ వినూత్న పథకాన్ని చేపట్టింది.
క్రీడల వేదిక టోక్యో నగరంలో గుట్టలుగుట్టలుగా పేరుకు పోయిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇతర కంప్యూటర్ పరికరాల ఇ-వేస్ట్ వ్యర్థాలను రిసైకిల్ చేయడం ద్వారా లభించిన స్వర్ణ,రజత, కాంస్య లోహాలను ఉపయోగించి…పతకాలను తయారు చేయటానికి రంగం సిద్ధం చేసింది.
50 వేల టన్నుల నుంచి 5 వేల పతకాలు
ఒలింపిక్స్ లో విజేతలుగా నిలిచిన వారి కోసం మొత్తం 5 వేల వరకూ స్వర్ణ,రజత, కాంస్య పతకాలు అవసరమని నిర్వాహక సంఘం అంచనావేసింది. ఈ పతకాలకు అవసరమైన బంగారం, వెండి, కంచు లోహాలను..ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచే సేకరించారు.
2018 నవంబర్ నాటికే 47 వేల 488 టన్నుల ఇ-వేస్ట్ ను సేకరించి…మొత్తం ఎనిమిది టన్నుల బంగారు, రజత, కంచు ను సేకరించారు. వీటితోనే టోక్యో ఒలింపిక్స్ పతకాలను తయారు చేయనున్నారు.
51 లక్షల వాడి పడేసిన స్మార్ట్ ఫోన్లు….
స్వర్ణ పతకాలకు అసరమైన బంగారాన్ని 28.4 కిలోలు, 3వేల 500 కిలోల వెండిని, 2వేల 700 గ్రాముల కంచు లోహాలను…ఇ-వేస్ట్ నుంచి రాబట్టగలిగారు.
పోటీల ప్రారంభంనాటికి… మొత్తం 50 వేల టన్నుల వ్యర్థాల నుంచి 5 వేల పతకాల లక్ష్యాన్ని చేరుకోగలమన్న ధీమాతో నిర్వాహక సంఘం ఉంది. గత ఏడాది నవంబర్ వరకూ సేకరించిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వ్యర్థాలలో…51 లక్షల స్మార్ట్ ఫోన్లు సైతం ఉన్నాయి.