ములాయం చర్యతో కంగుతిన్న సోనియా గాంధీ
లోక్‌సభ ఆఖరి రోజు ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు యూపీఏ కూటమిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. లోక్‌సభలో సోనియా గాంధీ పక్కనే నిల్చుని ములాయం ధైర్యంగా నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎలాగైన కుమారుడిని ప్రధానిగా చూడాలని ఆకాంక్షిస్తున్న సోనియా గాంధీ పక్కనే నిల్చుని… ఎన్నికల తర్వాత మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఆకాక్షించారు. అందుకు తన దీవెనలు ఉంటాయని చెప్పారు. దీంతో ములాయం పక్కనే కూర్చున్న సోనియా గాంధీ ముఖంలో నెత్తుటి చుక్క కనిపించలేదు. మోడీ అందరినీ కలుపుకుని […]
లోక్‌సభ ఆఖరి రోజు ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు యూపీఏ కూటమిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. లోక్‌సభలో సోనియా గాంధీ పక్కనే నిల్చుని ములాయం ధైర్యంగా నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఎలాగైన కుమారుడిని ప్రధానిగా చూడాలని ఆకాంక్షిస్తున్న సోనియా గాంధీ పక్కనే నిల్చుని… ఎన్నికల తర్వాత మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఆకాక్షించారు. అందుకు తన దీవెనలు ఉంటాయని చెప్పారు. దీంతో ములాయం పక్కనే కూర్చున్న సోనియా గాంధీ ముఖంలో నెత్తుటి చుక్క కనిపించలేదు.
మోడీ అందరినీ కలుపుకుని వెళ్లడంలో సమర్థులు. అందరినీ ముందుకు తీసుకెళ్లేందుకు ఎనలేని కృష్టి చేస్తున్నారు. ఇది అభినందనీయం. ఈ ఐదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశారు. అందుకే మరోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నా అని ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ములాయం వ్యాఖ్యలకు బీజేపీ, ఎన్‌డీఏ పక్షాలు బల్లలు చరిచి స్వాగతించాయి.
కాంగ్రెస్, యూపీఏ పక్షాలు మాత్రం దిగ్భ్రాంతికి లోనయ్యాయి.
అనంతరం ములాయం వ్యాఖ్యలపై స్పందించిన మోడీ… తనను ములాయం సింగ్ జీ దీవించారని… అందుకు ఆయనకు కృతజ్ఞతలు అని వ్యాఖ్యానించారు.
ములాయం సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ములాయం వ్యాఖ్యలను ఖండించారు.