Telugu Global
NEWS

ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్

భారత్ వేదికగా 2 మ్యాచ్ ల టీ-20, 5 మ్యాచ్ ల వన్డే సిరీస్ మే 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ఆసీస్ తో సిరీస్ కు టీమిండియా ఎంపిక రేపే ఇంగ్లండ్, వేల్స్ దేశాలు వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కు విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. ఐపీఎల్ కు ముందు…ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్టును….ముంబై వేదికగా రేపు జరిగే ఎంపిక సంఘం సమావేశంలో ఖరారు […]

ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్
X
  • భారత్ వేదికగా 2 మ్యాచ్ ల టీ-20, 5 మ్యాచ్ ల వన్డే సిరీస్
  • మే 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా వన్డే ప్రపంచకప్
  • ఆసీస్ తో సిరీస్ కు టీమిండియా ఎంపిక రేపే

ఇంగ్లండ్, వేల్స్ దేశాలు వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కు విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. ఐపీఎల్ కు ముందు…ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్టును….ముంబై వేదికగా రేపు జరిగే ఎంపిక సంఘం సమావేశంలో ఖరారు చేయనున్నారు.

ఇప్పటి వరకూ విశ్రాంతి తీసుకొన్న కెప్టెన్ విరాట్ కొహ్లీ తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. మరోవైపు..వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం…టీ-20 సిరీస్ లో విరామం ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది.

హాట్ ఫేవరెట్ టీమిండియా….

ఇంగ్లండ్ వేదికగా మరో మూడు మాసాలలో ప్రారంభమయ్యే 2019 వన్డే ప్రపంచకప్ కు…రెండుసార్లు విజేత టీమిండియా గురిపెట్టింది. ప్రపంచకప్ లో పాల్గొనటానికి ముందు చిట్టచివరి సన్నాహక సిరీస్ లో… ఆస్ట్రేలియాతో తలపడటానికి టీమిండియా సిద్ధమయ్యింది.

ఇటీవలే …ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పర్యటించి…స్వదేశానికి విజయవంతంగా తిరిగి వచ్చిన టీమిండియా… ఆస్ట్రేలియాతో ఐదుమ్యాచ్ ల వన్డే, రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ల్లో తలపడనుంది.

శుక్రవారమే టీమ్ సెలెక్షన్…..

ఈ సిరీస్ లో పాల్గొనే భారతజట్టును ప్రకటించడానికి…ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ…ముంబైలో సమావేశంకానుంది. న్యూజిలాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ కు.. దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కొహ్లీ…తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.

మరోవైపు…ఆస్ట్రేలియాతో జరిగే రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ నుంచి…వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది.

విరాట్ కొహ్లీ,రోహిత్ శర్మ, ధోనీ, మహ్మద్ షమీ లాంటి సీనియర్ ప్లేయర్ల వర్క్ లోడ్ ను సునిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించి..అమలు చేస్తోంది.

ఒక్క బెర్త్…ముగ్గురి పోటీ….

మరోవైపు…ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులోని ఆఖరి బెర్త్ కోసం…యువఆటగాళ్లు రాహుల్, రిషభ్ పంత్ లతో సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే అమీతుమీ తేల్చుకోనున్నాడు.

ప్రపంచకప్ బెర్త్ సాధించడానికి…ఆసీస్ తో సిరీసే…ఆఖరి అవకాశమన్నట్లుగా ఈ ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు.

బుమ్రా బ్యాక్…..

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తర్వాత నుంచి విశ్రాంతిలో ఉన్న యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా…ఆసీస్ తో సిరీస్ ద్వారా తిరిగి బరిలోకి దిగటానికి ఉరకలేస్తున్నాడు.

ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ ను 2-1తో నెగ్గి…టీ-20 సిరీస్ ను 1-1తో డ్రాగా ముగించిన టీమిండియా… న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను 4-1తో సొంతం చేసుకొన్నా… తీన్మార్ టీ-20 సిరీస్ ను మాత్రం 1-2తో చేజార్చుకోక తప్పలేదు.

స్వదేశీ వికెట్ల పై ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ లు…టీమిండియాకు అత్యంత కీలకంగా మారాయి. ప్రపంచకప్ లో పాల్గొనటానికి ముందు విరాట్ సేన ఆడనున్న ఆఖరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావటం గమనార్హం.

First Published:  14 Feb 2019 2:34 PM IST
Next Story