Telugu Global
NEWS

ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ సెల్ఫ్ గోల్

తప్పుడు కులధృవీకరణ పత్రంతో మోసం భారత హాకీ మాజీ కెప్టెన్ అరెస్టుకు రంగం సిద్ధం ఎస్ సీ రిజర్వేషన్ తో 2007 నుంచి ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం ట్రిపుల్ ఒలింపియన్, భారత హాకీ మాజీ కెప్టెన్ ముకేశ్ కుమార్ తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించడం ద్వారా అడ్డంగా దొరికిపోయాడు. భారత్ తరపున 307 అంతర్జాతీయ హాకీ మ్యాచ్ ల్లో పాల్గొన్న ముకేశ్ కు 80 గోల్స్ సాధించిన రికార్డు ఉంది. భారత విమానయాన సంస్థలో […]

ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ సెల్ఫ్ గోల్
X
  • తప్పుడు కులధృవీకరణ పత్రంతో మోసం
  • భారత హాకీ మాజీ కెప్టెన్ అరెస్టుకు రంగం సిద్ధం
  • ఎస్ సీ రిజర్వేషన్ తో 2007 నుంచి ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం

ట్రిపుల్ ఒలింపియన్, భారత హాకీ మాజీ కెప్టెన్ ముకేశ్ కుమార్ తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించడం ద్వారా అడ్డంగా దొరికిపోయాడు. భారత్ తరపున 307 అంతర్జాతీయ హాకీ మ్యాచ్ ల్లో పాల్గొన్న ముకేశ్ కు 80 గోల్స్ సాధించిన రికార్డు ఉంది.

భారత విమానయాన సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్న ముకేశ్…ఉద్యోగం నుంచి పదోన్నతి వరకూ…తప్పుడు కులధృవీకరణ పత్రం సమర్పించి అనుచిత లబ్ది పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ముకేశ్ పై ఎఫ్ఐఆర్….

భారత ప్రభుత్వం నుంచి గతంలోనే అర్జున పురస్కారం అందుకొన్న ముకేశ్… సికింద్రాబాద్ తహసిల్దార్ నుంచి ఎస్ సి మాల పేరుతో కులధృవీకరణ పత్రాన్ని పొందినట్లు, ఫోర్జరీ పత్రాలను ఉపయోగించినట్లు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో జనవరి 25నే కేసు నమోదయ్యింది.

ముకేశ్ సోదరుడు సురేశ్ కుమార్ పైన సైతం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే…ఈ విషయం మాత్రం కొద్ది గంటల క్రితమే వెలుగులోకి వచ్చింది.

మాల కాదు… నాయి బ్రాహ్మణుడు….

2007 నుంచి ఇండియన్ ఎయిర్ లైన్స్ విజిలెన్స్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న ముకేశ్ కుమార్… బీసీ-ఏ లోని నాయి బ్రాహ్మణ కులానికి చెందినవాడని…అయితే ఫోర్జరీ పత్రాలతో తన కులాన్ని ఎస్ సీ మాలగా మార్చుకొని మోసం చేశారంటూ గతంలోనే ఆరోపణలు రావడంతో విచారణకు కలెక్టర్ ఆదేశించారు.

అంతర్గత విచారణలో ముకేశ్ కులం బీసీ అని తేలిందని…అయితే ఫోర్జరీ పత్రాలతో ఎస్ సీ మాల కుల ధృవీకరణ పత్రం పొంది అనుచిత లబ్ది పొందారని… పైగా మోసం, దగా చేశారంటూ కేసులో తేలిందని అధికారులు తెలిపారు.

ట్రిపుల్ ఒలింపియన్….

ముకేశ్ కుమార్ తో పాటు..అతని సోదరుడు సురేశ్ కుమార్ సైతం…ఇండియన్ ఎయిర్ లైన్స్ ను మోసగించి ఉద్యోగం పొందటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

1992 బార్సిలోనా, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో పాల్గొన్న ముకేశ్ కుమార్ ను, అతని సోదరుడు సురేశ్ కుమార్ లను అరెస్టు చేసే అవకాశం ఉందని… బోయిన్ పల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రకటించారు.

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో…భారత టీ-20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ..పంజాబ్ పోలీస్ లో డీఎస్పీ ఉద్యోగం సంపాదించి..అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని మరచిపోకముందే… ముకేశ్ కుమార్ నకిలీ కులధృవీకరణ పత్రంతో ఇండియన్ ఎయిర్ లైన్స్ లో 2007 నుంచి ఉద్యోగం చేస్తూ, ప్రమోషన్లు పొందుతూ రావడం ఇప్పుడు క్రీడావర్గాలలో కలకలం రేపింది.

First Published:  13 Feb 2019 8:56 AM IST
Next Story