కేంద్రం ఇచ్చే 6 వేలకు రూ.4 వేలు కలిపి రూ. 10 వేలు " ఏపీ కేబినెట్ నిర్ణయం
కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకుని ఒక్కో రైతుకు పదివేలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఏపీ ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు ఇవ్వనున్నారు. విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రతి రైతు కుటుంబానికి 10వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండి కేంద్ర ప్రభుత్వ పథకం పరిధిలోకి రాని వారికి రాష్ట్ర ప్రభుత్వమే 10వేలు ఇస్తుందని కేబినెట్ భేటీ అనంతరం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు. ఈ 10 వేలను రెండు విడతల్లో ఇస్తామని […]
కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకుని ఒక్కో రైతుకు పదివేలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఏపీ ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు ఇవ్వనున్నారు. విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రతి రైతు కుటుంబానికి 10వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండి కేంద్ర ప్రభుత్వ పథకం పరిధిలోకి రాని వారికి రాష్ట్ర ప్రభుత్వమే 10వేలు ఇస్తుందని కేబినెట్ భేటీ అనంతరం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు.
ఈ 10 వేలను రెండు విడతల్లో ఇస్తామని చెప్పారు. లోన్ తీసుకునే అర్హత ఉన్న కౌలు రైతులకు కూడా సాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ పథకానికి ”అన్నదాత సుఖీభవ” పేరు పెట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలుపుకుని 10వేల రూపాయలు అందిస్తామని సోమిరెడ్డి చెప్పారు.
ఈ పథకం కోసం ఇప్పటికే ఐదు వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించామన్నారు మంత్రి. ఇప్పటికే ప్రకటించిన పథకాలకు, ఇచ్చిన చెక్‌లకు ఎన్నికల కోడ్ అడ్డు కాదన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అయితే పొలం యజమానికో, అది సాగు చేసే కౌలు రైతుకో ప్రభుత్వం చట్ట ప్రకారం సాయం చేయగలదు. కానీ సోమిరెడ్డి మాత్రం రైతుకు, కౌలు రైతుకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పడం… ఎలా సాధ్యమో ఆయనే చెప్పాలి.