కేఏ పాల్ కూడా ఓట్లు చీల్చడానికేనా?
ఇటీవల కేఏ పాల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. తానే అధికారంలోకి వస్తున్నానని, నియోజక వర్గానికి వంద కోట్లు విరాళం ఇస్తానని, ప్రపంచ దేశాల అధ్యక్షులంతా తనకు తెలుసంటూ చేసే వ్యాఖ్యలను జనం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కే ఏ పాల్ ప్రెస్‌మీట్‌ను జనం కామెడీ షోలా చూస్తున్నారన్న అభిప్రాయం ఉంది. పది వేల మందికి సభ్యత్వం ఇప్పిస్తే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తానని కేఏ పాల్ ప్రకటించారు. ఆ మధ్య ఒక ప్రెస్‌మీట్ లో హఠాత్తుగా యాంకర్ శ్వేత ని ఎమ్మెల్యే […]
ఇటీవల కేఏ పాల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. తానే అధికారంలోకి వస్తున్నానని, నియోజక వర్గానికి వంద కోట్లు విరాళం ఇస్తానని, ప్రపంచ దేశాల అధ్యక్షులంతా తనకు తెలుసంటూ చేసే వ్యాఖ్యలను జనం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కే ఏ పాల్ ప్రెస్‌మీట్‌ను జనం కామెడీ షోలా చూస్తున్నారన్న అభిప్రాయం ఉంది.
పది వేల మందికి సభ్యత్వం ఇప్పిస్తే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తానని కేఏ పాల్ ప్రకటించారు. ఆ మధ్య ఒక ప్రెస్‌మీట్ లో హఠాత్తుగా యాంకర్ శ్వేత ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేశారు పాల్. హిందూపురం నుంచి బాలకృష్ణపై ప్రజా శాంతి పార్టీ తరపున శ్వేత పోటీ చేస్తారని ప్రకటించారు. ఫిబ్రవరి 21లోగా 10వేల మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని ఆమెకు కండిషన్ పెట్టారు.
అయితే ఇటీవల జరిగిన మరో సమావేశంలో తాను ప్రకటించిన తొలి అభ్యర్థి శ్వేతా అడ్రస్ లేకుండా పోయారంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై శ్వేత తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.
కేఏ పాల్ తన గురించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈనెల 21లోగా 10వేల సభ్యత్వాలు పూర్తి చేయాలని కేఏ పాల్ తనకు చెప్పారని… కానీ ఇంకా ఆ గడువు ముగియకముందే తాను అడ్రస్ లేకుండా పోయానని కేఏ పాల్ ఎలా చెబుతారని ఆమె నిలదీశారు.
కేఏ పాల్ కూడా టికెట్లు అమ్ముకుంటున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సభ్యత్వం పేరుతో రూ.10, రూ.100 వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కేఏ పాల్ హఠాత్తుగా రాజకీయాల్లో రావడం వెనుక వైసీపీ ఓటు బ్యాంకును చీల్చే కుట్ర ఉందని తనకు తెలిసిపోయిందన్నారామె. కేఏ పాల్‌కు జర్నలిస్టులంటే చులకనగా ఉందని మండిపడ్డారు. దేవుడి బిడ్డను అంటూనే కేఏ పాల్ అబద్దాలు ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు.