Telugu Global
National

బీజేపీ ఎమ్మెల్యే రెండో భార్యను చితకబాదిన..... తల్లి, మొదటి భార్య..!

రెండో భార్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తమను పట్టించుకోవట్లేదని భావించిన మొదటి భార్య, అతని తల్లి కలిసి బీభత్సం సృష్టించారు. రెండో భార్యను, సదరు భర్తను కలిసి చితక్కొడుతుంటే వారికి జనాలు తోడయ్యారు. దీంతో రెండో భార్య ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… మహారాష్ట్రలోని అర్నీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజూ నారాయణ్. ఇతనికి ఇద్దరు భార్యలు. గత కొన్నిళ్లుగా అతని […]

బీజేపీ ఎమ్మెల్యే రెండో భార్యను చితకబాదిన..... తల్లి, మొదటి భార్య..!
X

రెండో భార్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తమను పట్టించుకోవట్లేదని భావించిన మొదటి భార్య, అతని తల్లి కలిసి బీభత్సం సృష్టించారు. రెండో భార్యను, సదరు భర్తను కలిసి చితక్కొడుతుంటే వారికి జనాలు తోడయ్యారు. దీంతో రెండో భార్య ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం…

మహారాష్ట్రలోని అర్నీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజూ నారాయణ్. ఇతనికి ఇద్దరు భార్యలు. గత కొన్నిళ్లుగా అతని రెండో భార్య ప్రియా షిండేతోనే ఉంటున్నాడు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా ప్రియానే తీసుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలో మొదటి భార్య అర్చనతో సహా తన తల్లిని కూడా నిర్లక్ష్యం చేశాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఇద్దరూ నారాయణ్‌కు బుద్ది చెప్పాలని భావించారు.

గత వారం తన నియోజకవర్గ పరిధిలోని ఒక క్రీడా టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి తన రెండో భార్యతో కలిసి వెళ్లి వస్తుండగా మార్గం మధ్యంలో అతని తల్లి, మొదటి భార్య అడ్డుకున్నారు. వారిద్దరూ కలిసి ప్రియను చితకబాదారు. మధ్యలో ఆమెను రక్షించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను కూడా కొట్టారు. వీరిద్దరికీ మద్దతుగా వచ్చిన ప్రజలు కూడా ఎమ్మెల్యే, ప్రియను కొట్టారు. దీంతో ప్రియకు గాయాలై సొమ్మసిల్లింది.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఎమ్మెల్యే నారాయణ్, ప్రియను ఆసుపత్రిలో చేర్చారు. ఘటన జరిగే సమయంలో రక్షణ సిబ్బంది ఉన్నా ప్రజలను ఆపలేక పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర చర్చకు దారి తీసింది. విలువలకు తిలోదకాలిచ్చి ఒక ఎమ్మెల్యే రెండో భార్యతో తిరగటం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రజలందరూ మొదటి భార్య అర్చనకే మద్దతు పలుకుతున్నారు.

First Published:  13 Feb 2019 6:10 PM IST
Next Story