ఇదే ఆఖరి కేబినెట్ భేటీ కావొచ్చు....
ఎన్నికలు తరుముకొస్తుండడంతో ఏపీ కేబినెట్ వరుసగా సమావేశం అవుతోంది. ఎనిమిది రోజుల క్రితం సమావేశమైన కేబినెట్ నేడు మరోసారి సమావేశం అవుతోంది. రేపు లేదా ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తుండడంతో ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కోడ్ అడ్డు వస్తుంది. ఈ నేపథ్యంలో నేడు కేబినెట్ భేటీ జరుగుతోంది. పెండింగ్‌లో ఉన్న భూ కేటాయింపులకు ఈ కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. దీనితో పాటు జగన్ ప్రకటించిన రైతులకు పెట్టుబడి సాయం పథకం తరహాలోనే అన్నదాత సుఖీభవ పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. […]
ఎన్నికలు తరుముకొస్తుండడంతో ఏపీ కేబినెట్ వరుసగా సమావేశం అవుతోంది. ఎనిమిది రోజుల క్రితం సమావేశమైన కేబినెట్ నేడు మరోసారి సమావేశం అవుతోంది. రేపు లేదా ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తుండడంతో ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కోడ్ అడ్డు వస్తుంది. ఈ నేపథ్యంలో నేడు కేబినెట్ భేటీ జరుగుతోంది.
పెండింగ్‌లో ఉన్న భూ కేటాయింపులకు ఈ కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. దీనితో పాటు జగన్ ప్రకటించిన రైతులకు పెట్టుబడి సాయం పథకం తరహాలోనే అన్నదాత సుఖీభవ పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇదే ఆఖరి కేబినెట్ భేటీ కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏడు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తే ఇకపై ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి… కేబినెట్ సమావేశాలు ఉండకపోవచ్చు. ఏడు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే సరికి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఇదే ఆఖరి కేబినెట్ సమావేశం కావొచ్చు.
ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత… సాధారణ ఎన్నికల షెడ్యూల్ రావడానికి నాలుగైదు రోజుల గ్యాప్ ఉంటే మరోసారి కేబినెట్ భేటీ జరగొచ్చు.