చీరాలలో అనూహ్య పరిణామం.... మీటింగ్ పెట్టాలని బలరాంకు ఆదేశం
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబునాయుడికి పంపించారు. ఆయన నేడు వైఎస్ జగన్‌ను కలవబోతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత రెండు మూడు రోజుల్లో తన నిర్ణయం చెబుతానని ఆమంచి వెల్లడించారు. అయితే ఆయన టీడీపీని వీడారు. దీంతో సీనియర్ నేత కరణం బలరాంను రంగంలోకి దింపింది టీడీపీ. చీరాలలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కరణం బలరాంను చంద్రబాబు ఆదేశించారు. ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో…. ప్రత్యామ్నాయం సిద్ధం చేయడంలో ఆలస్యం అయితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో […]
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబునాయుడికి పంపించారు. ఆయన నేడు వైఎస్ జగన్‌ను కలవబోతున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత రెండు మూడు రోజుల్లో తన నిర్ణయం చెబుతానని ఆమంచి వెల్లడించారు. అయితే ఆయన టీడీపీని వీడారు.
దీంతో సీనియర్ నేత కరణం బలరాంను రంగంలోకి దింపింది టీడీపీ. చీరాలలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కరణం బలరాంను చంద్రబాబు ఆదేశించారు.
ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో…. ప్రత్యామ్నాయం సిద్ధం చేయడంలో ఆలస్యం అయితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో చంద్రబాబు వెంటనే కరణం బలరాంను రంగంలోకి దింపినట్టు భావిస్తున్నారు. చీరాలకు కొత్త అభ్యర్థిని ఎంపిక చేసే వరకు కరణం బలరాం అక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.