తెలుగులో కార్తి స్ట్రయిట్ మూవీ ఇదేనా?
టాలీవుడ్ లో కార్తి చేసిన స్ట్రయిట్ మూవీ ఊపిరి. ఈ సినిమాలో నాగ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు కార్తి. కానీ సోలోగా మాత్రం ఈ హీరో ఇప్పటివరకు తెలుగులో నటించలేదు. ఊపిరి సినిమా నుంచి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న కార్తి, త్వరలోనే స్ట్రయిట్ తెలుగు మూవీ చేస్తానంటున్నాడు. ఇప్పటికే తెలుగులో ఐదారు కథలు విన్నానని, దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి రెండు కాన్సెప్ట్స్ చెప్పారని ప్రకటించాడు కార్తి. ఏలేటితో పాటు కొత్త దర్శకులు ఇద్దరుముగ్గురు […]
టాలీవుడ్ లో కార్తి చేసిన స్ట్రయిట్ మూవీ ఊపిరి. ఈ సినిమాలో నాగ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు కార్తి. కానీ సోలోగా మాత్రం ఈ హీరో ఇప్పటివరకు తెలుగులో నటించలేదు. ఊపిరి సినిమా నుంచి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న కార్తి, త్వరలోనే స్ట్రయిట్ తెలుగు మూవీ చేస్తానంటున్నాడు.
ఇప్పటికే తెలుగులో ఐదారు కథలు విన్నానని, దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి రెండు కాన్సెప్ట్స్ చెప్పారని ప్రకటించాడు కార్తి. ఏలేటితో పాటు కొత్త దర్శకులు ఇద్దరుముగ్గురు తనకు కథలు వినిపించారంటున్న కార్తి, వాటిలోంచి ఏ ఒక్క కథను ఇంకా ఫైనలైజ్ చేయలేదని తెలిపాడు.
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ తమిళ సినిమాలతోనే బిజీగా ఉన్నానని, టైం దొరికినప్పుడు కచ్చితంగా తెలుగులో సినిమా చేస్తానని, అది చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఉండొచ్చని కూడా స్పష్టంచేశాడు. ప్రస్తుతం కార్తి నటించిన దేవ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇలా స్ట్రయిట్ మూవీపై రియాక్ట్ అయ్యాడు.