బాబు సభకు హాజరైన వారి క్యారెక్టర్లపై ఐవైఆర్ పంచ్
ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన దీక్షపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. చంద్రబాబు దీక్షకు సంబంధించిన పత్రిక క్లిప్‌ను చూపిస్తూ ఇది ధర్మపోరాట సభ కంటే ఏపీని ముక్కలు చేసిన వారితో కూడిన కౌరవసభలా ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రితో మాట్లాడుతున్న ధృతరాష్ణుడిని చిత్రంలో చూడవచ్చు అంటూ పరోక్షంగా మన్మోహన్ సింగ్‌ను ధృతరాష్ణుడితో పోల్చారు. రాహుల్ గాంధీ రాకపై పరోక్షంగా లక్ష్మణ్ కుమార్ వచ్చి వెళ్లాడు అంటూ సెటైర్ వేశారు. సభకు ధుర్యోధనుడు మాత్రం హాజరు కాలేదన్నారు. ధుర్యోధనుడు అంటే మగాడే అయి ఉండాల్సిన అవసరం […]
ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన దీక్షపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. చంద్రబాబు దీక్షకు సంబంధించిన పత్రిక క్లిప్‌ను చూపిస్తూ ఇది ధర్మపోరాట సభ కంటే ఏపీని ముక్కలు చేసిన వారితో కూడిన కౌరవసభలా ఉందని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రితో మాట్లాడుతున్న ధృతరాష్ణుడిని చిత్రంలో చూడవచ్చు అంటూ పరోక్షంగా మన్మోహన్ సింగ్‌ను ధృతరాష్ణుడితో పోల్చారు. రాహుల్ గాంధీ రాకపై పరోక్షంగా లక్ష్మణ్ కుమార్ వచ్చి వెళ్లాడు అంటూ సెటైర్ వేశారు. సభకు ధుర్యోధనుడు మాత్రం హాజరు కాలేదన్నారు. ధుర్యోధనుడు అంటే మగాడే అయి ఉండాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా సోనియా గాంధీపై
ఐవైఆర్ కామెంట్ చేశారు.
This looks like #kauravasabha which divided #AP than a #dharmaporatasabha. Dhrutarashtra is having a word with the CM. Sakuni can be seen in the picture. Laxman Kumar came and went. Duryodhana did not attend the meeting. Duryodhana need not necessarily be a male . pic.twitter.com/Q6wsq8fTAL
— IYRKRao , Retd IAS (@IYRKRao) February 12, 2019