దేవినేని ఉమా అనుకూల ఎస్ఐ ల పై ఎస్పీ వేటు....
ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయాలంటూ మైలవరం వైసీపీ ఇన్‌చార్జ్ వసంత కృష్ణప్రసాద్ తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు నమోదు చేసిన కేసులు కుట్రపూరితం అని తేలిపోయింది. పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటూ వైసీపీ నేతలు పెద్దెత్తున నిరసన తెలపడంతో జిల్లా ఎస్పీ సర్వ శ్రేష్ట త్రిపాఠి లోతుగా దర్యాప్తు జరిపించారు. జి. కొండూరు ఎస్ఐ అస్ఫక్, మైలవరం ఎస్ఐ శ్రీనివాసరావులు కావాలనే తప్పుడు కేసులు నమోదు చేసినట్టు ఉన్నతాధికారులు తేల్చారు. దీంతో ఇద్దరు ఎస్ఐలను జిల్లా ఎస్పీ వీఆర్‌కు పంపించారు. ఈ కుట్రలో సూత్రధారిగా […]
ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయాలంటూ మైలవరం వైసీపీ ఇన్‌చార్జ్ వసంత కృష్ణప్రసాద్ తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు నమోదు చేసిన కేసులు కుట్రపూరితం అని తేలిపోయింది. పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటూ వైసీపీ నేతలు పెద్దెత్తున నిరసన తెలపడంతో జిల్లా ఎస్పీ సర్వ శ్రేష్ట త్రిపాఠి లోతుగా దర్యాప్తు జరిపించారు.
జి. కొండూరు ఎస్ఐ అస్ఫక్, మైలవరం ఎస్ఐ శ్రీనివాసరావులు కావాలనే తప్పుడు కేసులు నమోదు చేసినట్టు ఉన్నతాధికారులు తేల్చారు. దీంతో ఇద్దరు ఎస్ఐలను జిల్లా ఎస్పీ వీఆర్‌కు పంపించారు. ఈ కుట్రలో సూత్రధారిగా భావిస్తున్న మైలవరం సీఐ సూరిబాబుపై వేటు వేసేందుకు రంగం సిద్దమైంది.
మంత్రి దేవినేని ఉమాకు సీఐ, ఇద్దరు ఎస్ఐలు చాలాకాలంగా అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేసే కృష్ణప్రసాద్‌ను దెబ్బతీసేందుకు మంత్రి దేవినేని ఉమా ఆదేశాల మేరకు సీఐ, ఇద్దరు ఎస్ఐలు కలిసి కుట్ర చేసి తప్పుడు కేసులు పెట్టినట్టు తేలింది.
మంత్రి, పోలీసులు కలిసి కుట్ర చేయగా… దానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు టీడీపీ పత్రికలు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే పోలీసుల ఆరోపణలు పచ్చి అబద్దమని వైసీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఎస్పీ జోక్యం చేసుకుని అసలు విషయాన్ని బయటకు తీశారు.
పోలీసు శాఖ విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసిన ఇద్దరు ఎస్ఐలను వీఆర్‌కు పంపించారు. తప్పుడు కేసుల వెనుక సూత్రధారి అయిన మైలవరం సీఐ సూరిబాబును సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అయితే ఆయన ఇప్పటికే మంత్రి దేవినేని ఉమను ఆశ్రయించినట్టు చెబుతున్నారు.