మన పార్టీ అధికారంలోకి రాగానే... కార్యకర్తల పై అక్రమ కేసులు ఎత్తేస్తా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమ పార్టీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఏపీలో అధికారంలోనికి రాగానే కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదాకోసం పోరాడిన వైసీపీ, కమ్యూనిస్ట్ కార్యకర్తలపై చంద్రబాబు తప్పుడు కేసులు బనాయించాడని, వాటిని ఎత్తేస్తానని అన్నారు. ఇవాళ అనంతపుంలో నిర్వహించిన పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో ‘సమర శంఖారావం’ పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా […]
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమ పార్టీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఏపీలో అధికారంలోనికి రాగానే కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదాకోసం పోరాడిన వైసీపీ, కమ్యూనిస్ట్ కార్యకర్తలపై చంద్రబాబు తప్పుడు కేసులు బనాయించాడని, వాటిని ఎత్తేస్తానని అన్నారు. ఇవాళ అనంతపుంలో నిర్వహించిన పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో ‘సమర శంఖారావం’ పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలుగుదేశం ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,250 మందిపై అక్రమ కేసులు బనాయించిందని ఆయన ఆరోపించారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తలను తప్పకుండా ఆదుకుంటామని, వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో అవినీతి సొమ్ముతో అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుంటే డబ్బులు పంచడానికి మూటలను తరలిస్తారని, ఓటుకు 3వేలు ఇచ్చి అయినా గెలవడానికి ప్రయత్నిస్తారని ఆయన విమర్శించారు. 55 నెలల పాటు కడుపు మాడ్చి చివరి మూడు నెలలు అన్నం పెడతాననే వారిని ఏమనాలని ఆయన ప్రశ్నించారు.