Telugu Global
NEWS

ఓట‌మికి ముమ్మాటికి అత‌డే కార‌ణం....

ఆదివారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన చివ‌రి టీ20 మ్యాచ్‌లో ఓట‌మితో భార‌త్ సిరీస్‌ను కోల్పోయింది. ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో దినేశ్ కార్తీక్ వ‌ల్లే మ్యాచ్ ఓడిపోయార‌న్న విమ‌ర్శ అభిమానుల నుంచి వ‌చ్చింది. హ‌ర్బ‌జ‌న్ సింగ్ కూడా అదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. దినేశ్ కార్తీక్ వ్య‌వ‌హారం వ‌ల్లే భార‌త్ మ్యాచ్ ఓడిపోయింద‌ని సూటిగా చెప్పారు. దినేశ్ కార్తీక్ చేసిన చిన్న త‌ప్పు వ‌ల్లే ఓడిపోవాల్సి వ‌చ్చింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మూడో బంతికి సింగిల్ తీసే అవ‌కాశం వ‌చ్చినా దినేష్ కార్తీక్ ప‌రుగు తీయ‌క‌పోవ‌డాన్ని […]

ఓట‌మికి ముమ్మాటికి అత‌డే కార‌ణం....
X

ఆదివారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన చివ‌రి టీ20 మ్యాచ్‌లో ఓట‌మితో భార‌త్ సిరీస్‌ను కోల్పోయింది. ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో దినేశ్ కార్తీక్ వ‌ల్లే మ్యాచ్ ఓడిపోయార‌న్న విమ‌ర్శ అభిమానుల నుంచి వ‌చ్చింది. హ‌ర్బ‌జ‌న్ సింగ్ కూడా అదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. దినేశ్ కార్తీక్ వ్య‌వ‌హారం వ‌ల్లే భార‌త్ మ్యాచ్ ఓడిపోయింద‌ని సూటిగా చెప్పారు.

దినేశ్ కార్తీక్ చేసిన చిన్న త‌ప్పు వ‌ల్లే ఓడిపోవాల్సి వ‌చ్చింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మూడో బంతికి సింగిల్ తీసే అవ‌కాశం వ‌చ్చినా దినేష్ కార్తీక్ ప‌రుగు తీయ‌క‌పోవ‌డాన్ని హ‌ర్బ‌జ‌న్ త‌ప్పుప‌ట్టారు. కార్తీక్‌కు తనపై తనకు విశ్వాసం ఉండటం మంచిదే. కానీ అదే నమ్మకాన్ని ఇతరులపై కూడా ఉంచాలి.

ముఖ్యంగా బాగా ఆడుతున్నప్పుడు వారికి కూడా అవకాశం ఇవ్వాలి క‌దా అని వ్యాఖ్యానించారు. అవ‌తలి వైపు ఉన్న కృనాల్ అద్బుతంగా బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు సింగిల్ తీసి అత‌డికి అవకాశం ఇచ్చి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌న్నారు.

ఆదివారం మ్యాచ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌లో భార‌త్ 16 ప‌రుగులు చేయాల్సి ఉంది. మొద‌టి బంతికి డ‌బుల్ ర‌న్ తీసిన దినేశ్ కార్తీక్‌… ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు బంతుల‌ను వృధా చేశాడు. మూడో బంతికి ప‌రుగు ఖాయంగా వ‌చ్చేది. ఒక ద‌శ‌లో కృనాల్ దాదాపు అవ‌తలి వైపు ఉన్న కార్తీక్ వ‌ద్ద‌కు వెళ్లాడు. కానీ ప‌రుగు వ‌ద్ద‌ని కార్తీక్ చెప్ప‌డంతో కృనాల్ వెన‌క్కు వ‌చ్చేశాడు. ఆ త‌ర్వాత నాలుగో బంతికి దినేశ్ కార్తీక్ సింగిల్ ర‌న్ మాత్ర‌మే తీశారు.

ఐదో బంతికి కృనాల్ కూడా సింగిల్ తీశాడు. దాంతో మ్యాచ్ తారు మారైంది. ఆఖ‌రి బంతికి దినేశ్ కార్తీక్ సిక్స్ కొట్టినా ఫ‌లితం లేకుండాపోయింది. నాలుగు ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి చెందింది.

First Published:  11 Feb 2019 7:09 AM IST
Next Story