బాబుకు షాక్ ఇచ్చిన రెండు పార్టీలు
ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్నచంద్రబాబుకు వామపక్షాలు షాక్ ఇచ్చాయి. చంద్రబాబు దీక్షకు పలు పార్టీల నేతలతో పాటు వామపక్ష అగ్రనేతలు హాజరవుతారని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. చంద్రబాబు దీక్షకు హాజరై సంఘీభావం తెలపాల్సిందిగా సీపీఎం, సీపీఐలకు టీడీపీ లేఖలు కూడా రాసింది. అయితే సీపీఎం, సీపీఐ మాత్రం చంద్రబాబు దీక్షకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. గతంలో తాము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే పోలీసులతో కొట్టించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల […]
ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్నచంద్రబాబుకు వామపక్షాలు షాక్ ఇచ్చాయి. చంద్రబాబు దీక్షకు పలు పార్టీల నేతలతో పాటు వామపక్ష అగ్రనేతలు హాజరవుతారని టీడీపీ నేతలు ప్రచారం చేశారు.
చంద్రబాబు దీక్షకు హాజరై సంఘీభావం తెలపాల్సిందిగా సీపీఎం, సీపీఐలకు టీడీపీ లేఖలు కూడా రాసింది. అయితే సీపీఎం, సీపీఐ మాత్రం చంద్రబాబు దీక్షకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు.
గతంలో తాము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే పోలీసులతో కొట్టించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల వేళ హోదా నినాదం ఎత్తుకోవడం విచిత్రంగా ఉందని వామపక్షాలు అభిప్రాయపడ్డాయి. హోదా ఉద్యమ సమయంలో చంద్రబాబు తమ కార్యకర్తలపై కేసులు పెట్టించారని…. ఇప్పటికీ వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు మండిపడ్డారు.
పోరాటం చేయాల్సిన సమయంలో చేయకుండా ఎన్నికలు రెండు నెలల్లో ఉండగా చంద్రబాబు చేస్తున్న దీక్షలు కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని సీపీఎం, సీపీఐ అభిప్రాయపడ్డాయి. గతంలో ప్యాకేజీని స్వాగతించకుండా ఆ రోజే చంద్రబాబు హోదా కోసం పోరాటం చేసి ఉంటే తాము కూడా మద్దతు తెలిపి ఉండేవారిమని వామపక్షాలు వివరించాయి.