ముదురుతున్న విశాఖ బీచ్ మూడు విగ్రహాల వివాదం
విశాఖ బీచ్‌లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాల వివాదం ముదురుతోంది. వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాలు సైతం అమలు కావడం లేదు. విశాఖ బీచ్‌లో ఎంతో మంది మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. అయితే 2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత విగ్రహాల ఏర్పాటుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. విగ్రహం ఏర్పాటు చేయాలంటే విగ్రహ కమిటీ అనుమతి తప్పని సరి. ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపాలి. కానీ ఇవేవీ లేకుండానే గతేడాది డిసెంబర్ 1న దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణల విగ్రహాలు […]
విశాఖ బీచ్‌లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాల వివాదం ముదురుతోంది. వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాలు సైతం అమలు కావడం లేదు.
విశాఖ బీచ్‌లో ఎంతో మంది మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. అయితే 2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత విగ్రహాల ఏర్పాటుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. విగ్రహం ఏర్పాటు చేయాలంటే విగ్రహ కమిటీ అనుమతి తప్పని సరి.
ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపాలి. కానీ ఇవేవీ లేకుండానే గతేడాది డిసెంబర్ 1న దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణల విగ్రహాలు రాత్రికి రాత్రి వెలిశాయి. మంత్రి గంటా పుట్టిన రోజు సందర్భంగా వీటిని ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించారు.
ఈ మూడు విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ మంత్రి గంటా అండ ఉండడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అధికారులకు చివాట్లు పెట్టింది. దాంతో మూడు
రోజుల్లోగా అనుమతి లేని విగ్రహాలను తొలగించాలని విశాఖ మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. కానీ మంత్రి గంటా అండ ఉండడంతో వాటిని తొలగించలేదు.
అధికారులు కూడా మూడు రోజుల డెడ్‌లైన్ ముగిసి మూడు నెలలైనా మౌనంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సామాజివ కార్యకర్త సత్యనారాయణ సుప్రీం కోర్టులో పిల్ వేశారు. విశాఖ బీచ్‌లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదని… కానీ రాత్రికి రాత్రి
రాజకీయ అండతో మూడువిగ్రహాలను ఏర్పాటు చేశారని విమర్శించారు.
ఏదైనా నిబంధనల ప్రకారమే జరగాలన్నది తమ ఉద్దేశమని సత్యనారాయణ తెలిపారు. విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.
ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన విగ్రహాల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేక సుప్రీం కోర్టును సైతం ధిక్కరిస్తుందో చూడాలి.