మేయర్ పీఠం బరిలో జేసీ దివాకర్ రెడ్డి
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన స్థానంలో తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. తాను కార్పొరేషన్ ఎన్నికల్లో అనంతపురం నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. అనంతరం మేయర్‌గా పనిచేసేందుకు తాను సిద్దమన్నారు. అనంతపురం నగరంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకే తాను కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ అవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈనెల 15 నుంచి పాతూరు రోడ్లను విస్తరిస్తున్నట్టు చెప్పారు. నష్టపరిహారం కోసం బ్యాంకు ఖాతా […]
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన స్థానంలో తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. తాను కార్పొరేషన్ ఎన్నికల్లో అనంతపురం నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. అనంతరం మేయర్‌గా పనిచేసేందుకు తాను సిద్దమన్నారు. అనంతపురం నగరంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకే తాను కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ అవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు.
ఈనెల 15 నుంచి పాతూరు రోడ్లను విస్తరిస్తున్నట్టు చెప్పారు. నష్టపరిహారం కోసం బ్యాంకు ఖాతా నెంబర్ లు ఇస్తే డబ్బులు నేరుగా
వేస్తామన్నారు. కొందరి మాటలు విని బ్యాంకు ఖాతాలు ఇవ్వని పక్షంలో నష్టపోయేది వారేనన్నారు. రోడ్ల విస్తరణకు 120 కోట్లు సిద్దంగా ఉన్నాయని చెప్పారు.
దుకాణదారులు స్వచ్చంధంగా వారి దుకాణాలను తొలగించుకోవాలని…. లేనిపక్షంలో అధికారులే వాటిని కూల్చేస్తారని జేసీ ప్రకటించారు. రోడ్లు చాలా ఇరుకుగా మారిన నేపథ్యంలో మెజార్టీ ప్రజల ఆకాంక్ష మేరకు రోడ్ల విస్తరణ చేస్తున్నట్టు చెప్పారు.
చంద్రబాబు చాలా తెలివైన వాడని… ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసన్నారు జేసీ. పొత్తులు ఉన్నా లేకున్నా వచ్చే ఎన్నికల్లో మరోసారి చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని జేసీ జోస్యం చెప్పారు.