ఆ సమయంలో ఆడవారి ఫొటోలు తీయవద్దు " హైకోర్టు కీలక ఆదేశాలు
అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పుష్కరాలు, ఇతర పుణ్యక్షేత్రాల వద్ద మహిళా భక్తులు స్నానమాచరించే సమయంలో మీడియా, ఇతర సంస్థలు విచ్చలవిడిగా ఫొటోలు తీసి వాటిని పబ్లిష్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళ సందర్బంగా మహిళలు నదిలో మునిగి స్నానం చేస్తున్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక మహిళా న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. మహిళల ఫొటోలు, వీడియో తీయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు… మహిళలు స్నానం […]
అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పుష్కరాలు, ఇతర పుణ్యక్షేత్రాల వద్ద మహిళా భక్తులు స్నానమాచరించే సమయంలో మీడియా, ఇతర సంస్థలు విచ్చలవిడిగా ఫొటోలు తీసి వాటిని పబ్లిష్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళ సందర్బంగా మహిళలు నదిలో మునిగి స్నానం చేస్తున్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక మహిళా న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. మహిళల ఫొటోలు, వీడియో తీయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు… మహిళలు స్నానం చేస్తున్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీయకుండా అడ్డుకోవాలని యూపీ సర్కార్‌ను ఆదేశించింది. మహిళలు పుణ్యస్నానాలు చేస్తున్నప్పటి ఫొటోలను, వీడియోలను ప్రసారం చేయవద్దని మీడియా సంస్థలను హెచ్చరించింది.
పత్రికల్లో కూడా వాటిని ప్రచురించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే కుంభమేళాలో ఘాట్ల నుంచి 100మీటర్ల వరకు కెమెరా పాయింట్లపై నిషేధం ఉంది. అయినా నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. ఈనేపథ్యంలో అసలు వాటిని బయట ప్రచురించడానికి వీల్లేకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.