కాంగ్రెస్‌కు ఎంపీ అభ్యర్ధులు కావలెను !
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు సీనియర్ నేతలు తాము ఎంపీలుగా పోటీ చేస్తామని దూకుడు ప్రదర్శించారు. కొందరు నేతలు ఎంపీ సీట్లు తమకు ఇవ్వాలని షరతులు పెట్టారు. తాము పోటీకి సై అంటూ లీకులు ఇచ్చారు. తీరా ఇప్పుడు చూస్తే సీనియర్ నేతల్లో చాలా మంది పోటీకి వెనకడుగు వేస్తున్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ…. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ తర్వాత చాలా మంది సీనియర్ నేతలు ఎంపీగా పోటీ […]
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు సీనియర్ నేతలు తాము ఎంపీలుగా పోటీ చేస్తామని దూకుడు ప్రదర్శించారు. కొందరు నేతలు ఎంపీ సీట్లు తమకు ఇవ్వాలని షరతులు పెట్టారు. తాము పోటీకి సై అంటూ లీకులు ఇచ్చారు. తీరా ఇప్పుడు చూస్తే సీనియర్ నేతల్లో చాలా మంది పోటీకి వెనకడుగు వేస్తున్నారు.
ఢిల్లీలో రాహుల్‌గాంధీ…. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ తర్వాత చాలా మంది సీనియర్ నేతలు ఎంపీగా పోటీ చేసేందుకు రెడీగా లేరని తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆర్దికంగా నష్టపోయిన వారు ఎంపీగా పోటీ చేస్తే కొంత మేరకు హైకమాండ్ ఇచ్చే నిధులతో సర్దుకోవచ్చని ఆశించారు. కొందరు ఎంపీగానైనా గెలుస్తామని ఆశించారు. కానీ హైకమాండ్ నుంచి ఆర్దికపరమైన హామీ లభించలేదని తెలుస్తోంది. దీంతో కొందరు సీనియర్ నేతలు ఎంపీగా పోటీ నుంచి డ్రాప్ అయ్యారని తెలుస్తోంది.
మరోవైపు నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు సై అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు కొంత అనుకూలత ఉంది. బలం ఉంది. ఎంపీగా గెలిచేందుకు ఆయన దగ్గర ఆర్ధిక వనరులు ఉన్నాయి. ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థుల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్నటిదాకా డీకే అరుణ,రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ తో పాటు చాలా మంది నేతలు ఎంపీగా పోటీ చేసేందుకు సై అన్నారు. కానీ గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు చూసిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాం. ఇక ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా మైనస్‌గా మారుతుందని వీరు లెక్కలు వేస్తున్నారు.
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, భువనగిరి,ఖమ్మం,మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా తేలడం లేదు. ఇక్కడ పాత నేతలు పోటీ చేసేందుకు ఇష్టంగా లేరు. మరోవైపు కాంగ్రెస్‌లో ఎంపీ సీట్లు గెలవాలనే తాపత్రాయం కూడా కనపడడం లేదు. దీంతో కొత్త నేతలను ఇక్కడి నుంచి బరిలోకి దింపుతారనే ప్రచారం నడుస్తోంది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 10వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవాలని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఈ విషయమై ఒక ప్రకటన చేస్తూ తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ చేయాలనుకునే ఆసక్తి ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు గాంధీభవన్‌లో వారి పూర్తి బయోడెటాతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు.