కడుపులో కత్తెర మరిచిన వైద్యులు
కడుపులో కత్తెర పెట్టి కుట్లేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నిమ్స్ వైద్యులు ఒక వ్యక్తి కడుపులో కత్తెర పెట్టి ఆపరేషన్ ముగించారు. కుట్లేసి ఇంటికి పంపించారు. మూడు నెలల తర్వాత కడుపులో కత్తెర విషయం బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన మహేశ్వర్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం నిమ్స్‌లో హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లాడు. కానీ ఇటీవల పదేపదే కడుపు నొప్పి వస్తుండడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించాడు. అక్కడి డాక్టర్లు ఎక్స్‌రే తీయగా పొట్టలో […]
కడుపులో కత్తెర పెట్టి కుట్లేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నిమ్స్ వైద్యులు ఒక వ్యక్తి కడుపులో కత్తెర పెట్టి ఆపరేషన్ ముగించారు. కుట్లేసి ఇంటికి పంపించారు. మూడు నెలల తర్వాత కడుపులో కత్తెర విషయం బయటపడింది.
హైదరాబాద్‌కు చెందిన మహేశ్వర్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం నిమ్స్‌లో హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లాడు. కానీ ఇటీవల పదేపదే కడుపు నొప్పి వస్తుండడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించాడు. అక్కడి డాక్టర్లు ఎక్స్‌రే తీయగా పొట్టలో కత్తెర క్లియర్‌గా కనిపించింది.
దీంతో వారు షాక్ అయ్యారు. కడుపులోకి కత్తెర ఎలా వచ్చిందని ఆరా తీయగా మూడు నెలల క్రితం ఆపరేషన్ చేయించుకున్నట్టు చెప్పాడు. దాంతో కడుపులోకి కత్తెర ఎలా చేరిందన్న దానిపై స్పష్టత వచ్చింది. వెంటనే మహేశ్వర్ తన బంధువులతో కలిసి నిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా… ఆపరేషన్ చేసిన డాక్టర్లు ముఖం చాటేశారు.
ఆపరేషన్ చేసిన వైద్యులు ఇప్పుడు అందుబాటులో లేరని… విషయం ఏంటో తమకు చెప్పాలని ఆస్పత్రి సిబ్బంది ముందుకొచ్చారు. కడుపులో కత్తెర పెట్టి ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితుడు ఆస్పత్రి ముందు బైఠాయించాడు.