Telugu Global
Cinema & Entertainment

పారితోషికం సవరించిన నాని

కృష్ణార్జున యుద్ధం హిట్ అయితే ఈపాటికి 12 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకునే హీరోల జాబితాలోకి చేరిపోయేవాడు నాని. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నిర్మాతలకు అందుబాటులో ఉండడం కోసం నాని తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం సినిమాకు 11 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న నేచురల్ స్టార్, ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమాకు కోటి రూపాయలు తగ్గించి 10 కోట్ల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకున్నాడట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ […]

పారితోషికం సవరించిన నాని
X

కృష్ణార్జున యుద్ధం హిట్ అయితే ఈపాటికి 12 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకునే హీరోల జాబితాలోకి చేరిపోయేవాడు నాని. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నిర్మాతలకు అందుబాటులో ఉండడం కోసం నాని తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం సినిమాకు 11 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న నేచురల్ స్టార్, ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమాకు కోటి రూపాయలు తగ్గించి 10 కోట్ల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకున్నాడట.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది జెర్సీ సినిమా. హారిక-హాసిని బ్యానర్ కు ఇది బ్రాంచ్ ఆఫీస్ లాంటిది. హీరోల్ని చక్కగా చూసుకుంటారనే ఇమేజ్ ఉంది ఈ రెండు బ్యానర్లకు. సో.. జెర్సీ సినిమా థియేటర్లలోకి వచ్చి హిట్ అయితే.. కచ్చితంగా నానికి అదనపు మొత్తం దక్కడం గ్యారెంటీ.

రీసెంట్ గా ఈ సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్ అయింది. జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది. నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  9 Feb 2019 10:30 AM IST
Next Story