మన్నెం నాగేశ్వర రావు భార్య లావాదేవీలపై కోల్‌కతా పోలీసుల దాడులు
ఇటీవల కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు వచ్చిన సీబీఐ అధికారులను అరెస్ట్ చేసి సంచలనం సృష్టించిన బెంగాల్ పోలీసులు మరో అడుగు ముందుకేశారు. మొన్నటి వరకు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేసిన తెలుగు ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు కుటుంబం ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మన్నెం నాగేశ్వరరావు భార్యకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్న రెండు సంస్థలపై కోల్‌కతా పోలీసులు దాడులు నిర్వహించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏంజెలా మర్చైంటైల్ అనే సంస్థపై దాడులు నిర్వహించారు. మన్నెం నాగేశ్వరరావు […]
ఇటీవల కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు వచ్చిన సీబీఐ అధికారులను అరెస్ట్ చేసి సంచలనం సృష్టించిన బెంగాల్ పోలీసులు మరో అడుగు ముందుకేశారు.
మొన్నటి వరకు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేసిన తెలుగు ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు కుటుంబం ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మన్నెం నాగేశ్వరరావు భార్యకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్న రెండు సంస్థలపై కోల్‌కతా పోలీసులు దాడులు నిర్వహించారు.
కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏంజెలా మర్చైంటైల్ అనే సంస్థపై దాడులు నిర్వహించారు. మన్నెం నాగేశ్వరరావు భార్య మన్యం సంధ్య, ఈ కంపెనీకి మధ్య చాలాసార్లు ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఈ కంపెనీకి తన భార్యకు ఎలాంటి సంబంధం లేదని మన్నెం నాగేశ్వరరావు చెప్పారు.
దీనిపై గతంలోనే తాను వివరణ ఇచ్చానన్నారు. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో విచారించేందుకు సీబీఐ అధికారులకు ఆదేశాలు మన్నెం నాగేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో జారీ అయ్యాయి. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం మన్నెం నాగేశ్వరరావును టార్గెట్ చేసినట్టు అనుమానిస్తున్నారు.