గృహప్రవేశ వేడుకలో ఇద్దరిని తొక్కి చంపిన ఏనుగు
రోటిన్‌కు భిన్నంగా చేయాలనే తపన ఇటీవల జనాల్లో బాగా పెరిగింది. డబ్బున్న వాళ్లకు ఈ భావన మరీ ఎక్కువ. ఇలాగే ఆలోచించి కొంప మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి కేరళలో. గృహప్రవేశం సందర్భంగా అందరూ ఆవును తీసుకొస్తారు. కానీ కేరళకు చెందిన షైజు అనే వ్యాపారి ఏనుగును తెచ్చాడు. బంధువుల ముందు తన ఘనత చూపెట్టుకునేందుకు ప్రయత్నించాడు. గువాయూర్ కొత్తపదిలో ఉండే షైజు ఇటీవల ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశం సందర్భంగా ఆవుకు బదులు సమీప దేవాలయంలో ఉండే రామచంద్రన్ అనే భారీ ఏనుగును ఇంటికి తెచ్చాడు. అంతా […]
రోటిన్‌కు భిన్నంగా చేయాలనే తపన ఇటీవల జనాల్లో బాగా పెరిగింది. డబ్బున్న వాళ్లకు ఈ భావన మరీ ఎక్కువ. ఇలాగే ఆలోచించి కొంప మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి కేరళలో. గృహప్రవేశం సందర్భంగా అందరూ ఆవును తీసుకొస్తారు. కానీ కేరళకు చెందిన షైజు అనే వ్యాపారి ఏనుగును తెచ్చాడు. బంధువుల ముందు తన ఘనత చూపెట్టుకునేందుకు ప్రయత్నించాడు.
గువాయూర్ కొత్తపదిలో ఉండే షైజు ఇటీవల ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశం సందర్భంగా ఆవుకు బదులు సమీప దేవాలయంలో ఉండే రామచంద్రన్ అనే భారీ ఏనుగును ఇంటికి తెచ్చాడు. అంతా బాగుందని ఆనందిస్తున్న సమయంలోనే కొందరు బాణా సంచా పేల్చారు. అంతే ఏనుగు రామచంద్రన్‌కు తిక్కరేగింది. ఇంటి వద్ద బీభత్సం సృష్టించింది. తోరణాలను తెంచిపడేసింది. బంధువులు పరుగో పరుగు. ఈ సమయంలోనే 66 ఏళ్ల నారాయణ ఏనుగుకు చిక్కాడు. అతడిని ఏనుగు తొక్కి చంపేసింది. మరో వ్యక్తిపైనా దాడి చేసింది. నారాయణ అక్కడికక్కడే చనిపోగా… మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు వదిలాడు. మరో ఏడుగురు గాయపడ్డారు.
ఏనుగు బీభత్సాన్ని మావటి కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. బీహార్ నుంచి ఈ ఏనుగును కేరళకు తీసుకొచ్చారు. దానికి మళయాళంలో మావటి చెప్పే విషయాలు అర్థం కాక ఇలా పదేపదే రచ్చ చేస్తుంటుందని చెబుతున్నారు.