జస్టిస్ సునీల్ చౌదరికి కీలక పదవి అప్పగింత
ఇటీవలే హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సునీల్ చౌదరికి కీలక పదవి దక్కింది. ఆయన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో ఉండే అవకాశాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో నౌషద్ అలీ ఉన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలంటూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసి చంద్రబాబుకు ఊరట కల్పించేలా గతంలో తీర్పును ఇచ్చింది సునీల్ చౌదరి ధర్మాసనమే.

ఇటీవలే హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సునీల్ చౌదరికి కీలక పదవి దక్కింది. ఆయన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడిగా ప్రభుత్వం నియమించింది.
ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో ఉండే అవకాశాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో నౌషద్ అలీ ఉన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలంటూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసి చంద్రబాబుకు ఊరట కల్పించేలా గతంలో తీర్పును ఇచ్చింది సునీల్ చౌదరి ధర్మాసనమే.