సీఎం రమేష్‌పై వాట్సాప్ సంస్థ వేటు... కారణం అదే...
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై వాట్సాప్ సంస్థ వేటు వేసింది. ఆయన ఖాతాను వాట్సాప్ సంస్థ నిషేధించింది. సీఎం రమేష్‌కు వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారని ఆ సంస్థ వివరించింది. ఇటీవల సీఎం రమేష్ వాట్సాప్ ఖాతా పనిచేయడం లేదు. దీనిపై వాట్సాప్ సంస్థను ఎంపీ వివరణ కోరారు. ఇందుకు స్పందించిన సంస్థ… మీరు వాట్సాప్ నియమ నిబంధనలను ఉల్లంఘించారు. మీపై చాలా ఫిర్యాదు అందాయి. అందుకే బ్యాన్ చేశాం. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను కాపాడే చర్యల్లో భాగంగా ఫిర్యాదు దారుల వివరాలను […]
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై వాట్సాప్ సంస్థ వేటు వేసింది. ఆయన ఖాతాను వాట్సాప్ సంస్థ నిషేధించింది. సీఎం రమేష్‌కు వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారని ఆ సంస్థ వివరించింది.
ఇటీవల సీఎం రమేష్ వాట్సాప్ ఖాతా పనిచేయడం లేదు. దీనిపై వాట్సాప్ సంస్థను ఎంపీ వివరణ కోరారు. ఇందుకు స్పందించిన సంస్థ… మీరు వాట్సాప్ నియమ నిబంధనలను ఉల్లంఘించారు. మీపై చాలా ఫిర్యాదు అందాయి. అందుకే బ్యాన్ చేశాం. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను కాపాడే చర్యల్లో భాగంగా ఫిర్యాదు దారుల వివరాలను మాత్రం అందజేయలేమని
స్పష్టం చేసింది.
సీఎం రమేష్ తన వాట్సాప్ ఖాతా అవాస్తవాలను, సమాజానికి ఇబ్బంది కలిగించే విషయాలను ప్రచారం చేయడం వల్లే వేటు పడినట్టు భావిస్తున్నారు. అయితే తన వాట్సాప్ ఖాతా పనిచేయకపోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని సీఎం రమేష్ ఆరోపించారు.