రిస్క్‌లో పడ్డ ఆదినారాయణరెడ్డి
అనుకున్నట్టే అయింది. మంత్రి ఆదినారాయణరెడ్డి నెత్తిపై చంద్రబాబు తనదైన శైలిలో బండలేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాను మరోసారి జమ్మలమడుగు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ఆదినారాయణరెడ్డి చెబుతూ వచ్చారు. అటు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా తానే ఈసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చారు. చివరకు రామసుబ్బారెడ్డి మాటే నెగ్గింది. మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప లోక్‌సభ అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. సుధీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో గత్యంతరం లేక ఆదినారాయణరెడ్డి కూడా అందుకు అంగీకరించారు. అయితే తనను ఎంపీ […]
అనుకున్నట్టే అయింది. మంత్రి ఆదినారాయణరెడ్డి నెత్తిపై చంద్రబాబు తనదైన శైలిలో బండలేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాను మరోసారి జమ్మలమడుగు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ఆదినారాయణరెడ్డి చెబుతూ వచ్చారు. అటు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా తానే ఈసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చారు.
చివరకు రామసుబ్బారెడ్డి మాటే నెగ్గింది. మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప లోక్‌సభ అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. సుధీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో గత్యంతరం లేక ఆదినారాయణరెడ్డి కూడా అందుకు అంగీకరించారు. అయితే తనను ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన సమయంలో ఆదినారాయణరెడ్డికి, రామసుబ్బారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగినట్టు
చెబుతున్నారు.
కడప ఎంపీగా పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న అభిప్రాయం ఉండడంతో … ఓడిపోతే తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఆది కండిషన్ పెట్టారు. దాంతో పాటు తాను ఎంపీ అభ్యర్థిగా వెళ్తున్నందున రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్న మరో డిమాండ్ కూడా పెట్టాడు. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇవ్వడం సరైంది కాదన్న మెలిక పెట్టే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆదినారాయణరెడ్డి ఈ డిమాండ్ పెట్టారని తెలుస్తోంది.
ఆది నారాయణరెడ్డి కండిషన్‌ను రామసుబ్బారెడ్డి కూడా అంగీకరించారు. శుక్రవారం సాయంత్రమే చంద్రబాబుకు ఎమ్మెల్సీ పదవికి సంబంధించి రాజీనామా లేఖ ఇచ్చేశారు. ఈ పరిణామంలో తమ పంథమే నెగ్గిందని రామసుబ్బారెడ్డి వర్గం సంబరపడుతోంది. ఆదినారాయణరెడ్డి వర్గీయులు మాత్రం కడప ఎంపీగా పోటీ అంటే ఫలితం ఏంటో ముందే తెలిసిపోయినట్టేనని నిరాశ చెందుతున్నారు.