జగన్ సమావేశాల్లో.... ఏపీ నిఘా అధికారులు
ఒకప్పుడు నిఘా విభాగం పని వేరుగా ఉండేది. కానీ ఓటుకు నోటు కేసు తర్వాత ఏపీ నిఘా విభాగానిది ఒకటే పని. రాజకీయ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు? వారు ఎవరెవరిని కలుస్తున్నారు? ఏ కేసు ఎక్కడి నుంచి వస్తుంది? అని తెలుసుకోవడానికి ఏపీ నిఘా విభాగం ఎక్కువగా పనిచేస్తుంది. తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఏపీ ఇంటెలిజిన్స్ అధికారులు ఇదే పనిచేశారు. తెలుగుదేశం పోటీ చేసే నియోజకవర్గాలకు అన్ని రకాలుగా సాయపడేవిధంగా పనిచేశారు. ఎన్నికల సర్వేలు కూడా […]
ఒకప్పుడు నిఘా విభాగం పని వేరుగా ఉండేది. కానీ ఓటుకు నోటు కేసు తర్వాత ఏపీ నిఘా విభాగానిది ఒకటే పని. రాజకీయ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు? వారు ఎవరెవరిని కలుస్తున్నారు? ఏ కేసు ఎక్కడి నుంచి వస్తుంది? అని తెలుసుకోవడానికి ఏపీ నిఘా విభాగం ఎక్కువగా పనిచేస్తుంది.
తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఏపీ ఇంటెలిజిన్స్ అధికారులు ఇదే పనిచేశారు. తెలుగుదేశం పోటీ చేసే నియోజకవర్గాలకు అన్ని రకాలుగా సాయపడేవిధంగా పనిచేశారు. ఎన్నికల సర్వేలు కూడా చేశారు. అభ్యర్థుల బలబలాలును విశ్లేషించారు. అంతేకాదు మండలాల వారీగా నేతల గురించి వివరాలు అందించారు.
ఏపీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నిఘా బృందం ఇదే పనిచేపట్టింది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ రోజువారీ కార్యక్రమాలపై పూర్తి నిఘా పెట్టింది. వైసీపీ ‘అన్న పిలుపు’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా తటస్తులు,మేధావులు, రాజకీయ సంబంధం లేని ఇతర వర్గాలతో సమావేశమవుతున్నారు.
తిరుపతిలో అన్న పిలుపు మొదటి కార్యక్రమం చేపట్టారు. ఈ సమావేశానికి 400 మంది హాజరయ్యారు. ఓ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఈ మీటింగ్‌లో పాల్గొనేవారికి ముందే ఐడి కార్డులు అందజేశారు. వారికి మాత్రమే అనుమతి ఇచ్చారు.
అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన కొందరు తటస్తులకు తిరుపతిలో పనిచేస్తున్న ఓ నిఘా విభాగం అధికారి కనిపించారు. ఏం సారూ మీరెందుకు ఇటు వచ్చారు? అని ప్రశ్నిస్తే….డ్యూటీలో భాగంగా వచ్చినట్లు చెప్పారు. ఈ విషయం వైసీపీ నేతలకు చెప్పొద్దు అని ఆయన ప్రాధేయపడ్డారట.
అయితే ఈ సమావేశానికి ఐడి కార్డులు ఇచ్చిన వైసీపీ నేతలు ఆ నిఘా విభాగం అధికారికి కూడా ఐడి కార్డు ఇచ్చారు. ఇక్కడే కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రతిపక్ష నేత సమావేశాలపై నిఘా నేత్రం వెంటాడుతుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం తాము ఐడికార్డులు ఎవరెవరికి ఇస్తున్నాం…. వారి వివరాలు తెలుసుకోలేకపోవడం పార్టీ వైఫల్యమే. నిఘా విభాగం అధికారులను కనిపెట్టలేకపోవడం కూడా ఓ మైనస్ పాయింటే. తిరుపతికి చెందిన నేతలు కూడా ఎవరు తటస్తులు… వారు ఏం పని చేస్తారనేది తెలుసుకోలేకపోవడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ కార్యక్రమంలో జగన్ అందరితో ఇంటరాక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. వారు చెప్పింది సావధానంగా వింటున్నారు. కానీ ఆయన చుట్టూ ఉన్న కోటరీ మాత్రం ఇతరులను దగ్గరికి రానీయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు తెలిసిన విషయాలను జగన్ దగ్గరికి తీసుకెళ్లేందుకు కొందరు ప్రయత్నిస్తే… ఈ కోటరీ అడ్డుకున్నదని సమావేశంలో పాల్గొన్న కొందరు బయట చర్చించుకోవడం కనిపించింది.
నిఘా విభాగం అధికారులు సమావేశానికి వస్తే కనిపెట్టకపోవడం ఏంటి? అనే చర్చ కూడా వీరి మధ్య నడిచింది. ఇలాగే పార్టీ వ్యవహారాలు కొనసాగితే…. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీకి నష్టం జరుగుతుందనే విశ్లేషణలు సమావేశానికి హాజరైన వారి దగ్గరి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను బట్టి తెలుస్తోంది.