కామెడీ సినిమా మొదలైంది
కామెడీ చిత్రాల సృష్టికర్త నాగేశ్వర రెడ్డి మరో సినిమా షురూ చేశాడు. ఈసారి ఈ దర్శకుడు రూటు మార్చాడు. ఇప్పటివరకు కామెడీతో ఎలాంటి సంబంధం లేని ఇద్దరు హీరోహీరోయిన్లను తీసుకున్నాడు. వాళ్లే సందీప్ కిషన్, హన్సిక. వీళ్లిద్దరి కాంబోలో కొత్త సినిమా ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమాకు తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కర్నూల్ లో ప్రారంభమైన మొదటి షెడ్యూల్ లోనే కొన్ని కామెడీ సన్నివేశాల చిత్రీకరణ స్టార్ట్ […]
కామెడీ చిత్రాల సృష్టికర్త నాగేశ్వర రెడ్డి మరో సినిమా షురూ చేశాడు. ఈసారి ఈ దర్శకుడు రూటు మార్చాడు. ఇప్పటివరకు కామెడీతో ఎలాంటి సంబంధం లేని ఇద్దరు హీరోహీరోయిన్లను తీసుకున్నాడు. వాళ్లే సందీప్ కిషన్, హన్సిక. వీళ్లిద్దరి కాంబోలో కొత్త సినిమా ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చింది.
ఈ సినిమాకు తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కర్నూల్ లో ప్రారంభమైన మొదటి షెడ్యూల్ లోనే కొన్ని కామెడీ సన్నివేశాల చిత్రీకరణ స్టార్ట్ చేశారు. 3 షెడ్యూల్స్ లో సినిమాను పూర్తిచేసి జూన్ నాటికి థియేటర్లలోకి రావాలనేది ప్లాన్.
ఇప్పటివరకు ఫుల్ లెంగ్త్ కామెడీ చేయలేదు సందీప్ కిషన్. ఇంకా చెప్పాలంటే తన సినిమాల్లో కూడా పెద్దగా కామెడీ పండించిన దాఖలాలు లేవు. అలాంటి హీరో ఎలా కామెడీ పండిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. కనీసం తెనాలి రామకృష్ణ అయినా సందీప్ కెరీర్ కు ప్లస్ అవుతుందేమో చూడాలి.