ఆ టైంలో నేను అలా చేయడం తప్పే
పారిశ్రామికవేత్త, తన మేనమామ జయరాం హత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని శిఖా చౌదరి చెబుతోంది. హత్యలో శిఖా ప్రమేయం కూడా ఉందని, ఏపీకి చెందిన కొందరు పెద్దలు ఆమెను రక్షించారని…. కాబట్టి కేసును తొలి నుంచి విచారణ జరపాలంటూ తెలంగాణ పోలీసులను జయరాం భార్య ఆశ్రయించడం, కేసు తెలంగాణకు బదిలీ అయిన నేపథ్యంలో శిఖాచౌదరి ఒక చానల్‌తో మాట్లాడారు. తాను అమాయకురాలినని చెప్పారు. హత్యతో తనకు సంబంధం లేదన్నారామె. రాకేష్ తో తాను మాట్లాడక ఏడు నెలలవుతోందన్నారు. జయరాం హత్య జరిగినట్టు తెలియగానే తాను ఆయన […]
పారిశ్రామికవేత్త, తన మేనమామ జయరాం హత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని శిఖా చౌదరి చెబుతోంది. హత్యలో శిఖా ప్రమేయం కూడా ఉందని, ఏపీకి చెందిన కొందరు పెద్దలు ఆమెను రక్షించారని…. కాబట్టి కేసును తొలి నుంచి విచారణ జరపాలంటూ తెలంగాణ పోలీసులను జయరాం భార్య ఆశ్రయించడం, కేసు తెలంగాణకు బదిలీ అయిన నేపథ్యంలో శిఖాచౌదరి ఒక చానల్‌తో మాట్లాడారు. తాను అమాయకురాలినని చెప్పారు.
హత్యతో తనకు సంబంధం లేదన్నారామె. రాకేష్ తో తాను మాట్లాడక ఏడు నెలలవుతోందన్నారు. జయరాం హత్య జరిగినట్టు తెలియగానే తాను ఆయన ఇంటికి వెళ్లి ఫైల్ తీసుకురావడం తప్పేనని అంగీకరించారు. ఆ సమయంలో అలా చేయకుండా ఉండాల్సిందన్నారు. తాను ఒక ప్రాజెక్టు ఫైల్‌ను జయరాం వద్ద ఉంచానని… ఆయన చనిపోయారని తెలియగానే ఆ ఫైల్ కోసమే
తాను ఆయన ఇంటికి వెళ్లానని చెప్పారు.
జయరాం భార్యకు తానంటే నచ్చదని ఆమె ఇండియాకు వచ్చిన తర్వాత వారి ఇంటికి వెళ్లడం కుదరదనే… ముందుగానే ఫైల్ తెచ్చుకునేందుకు వెళ్లానని చెప్పారు. ప్రాజెక్టు ఫైల్ తప్ప మరే ఇతర డాక్యుమెంట్లు తాను తెచ్చుకోలేదని చెప్పారు. జయరాం చనిపోయాడని తెలియగానే తాను ఫైల్ కోసం ప్రయత్నం చేయడం తప్పేనని చెప్పారు.
ముందు రోజు ఉదయం ఫోన్ చేసి కోటి రూపాయలు సర్దాల్సిందిగా చెప్పారని…. ఎందుకు అని అడగ్గా ఏడాది క్రితం ఒకరి వద్ద తాను 4 కోట్లు అప్పు తీసుకున్నానని… దాన్ని చెల్లించేందుకు అని చెప్పారన్నారు. అదే తాను జయరాంతో మాట్లాడిన చివరి కాల్ అని చెప్పారు.
ఆ తర్వాత జయరాం చనిపోయారని తన తల్లి ఫోన్ చేసి చెప్పిందని శిఖాచౌదరి వివరించారు. హత్య కేసులో తన అత్త పద్మశ్రీని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.