అంబానీకి 30వేల కోట్లు దోచిపెట్టారు
రాఫెల్ కుంభకోణంలో మోడీ ప్రమేయం నేరుగా ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాఫెల్ డీల్ కుదుర్చుకున్నది అనిల్ అంబానీ కోసమే గానీ దేశంకోసం కాదన్నారు. ఇప్పటి వరకు రాఫెల్ డీల్‌పై ప్రధాని మోడీ, రక్షణ మంత్రి నిర్మాల సీతారామన్ చెప్పినవన్నీ అబద్దాలేనన్నారు. తాము చేస్తున్న ఆరోపణలపై మోడీ స్పష్టమైన సమాధానం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు రాహుల్. కార్పొరేట్ శక్తుల కోసమే మోడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. రాఫెల్ డీల్‌పై నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయమే ఫ్రాన్స్‌తో ఎందుకు చర్చలు జరిపిందని రాహుల్ […]
రాఫెల్ కుంభకోణంలో మోడీ ప్రమేయం నేరుగా ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాఫెల్ డీల్ కుదుర్చుకున్నది అనిల్ అంబానీ కోసమే గానీ దేశంకోసం కాదన్నారు.
ఇప్పటి వరకు రాఫెల్ డీల్‌పై ప్రధాని మోడీ, రక్షణ మంత్రి నిర్మాల సీతారామన్ చెప్పినవన్నీ అబద్దాలేనన్నారు. తాము చేస్తున్న ఆరోపణలపై మోడీ స్పష్టమైన సమాధానం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు రాహుల్.
కార్పొరేట్ శక్తుల కోసమే మోడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. రాఫెల్ డీల్‌పై నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయమే ఫ్రాన్స్‌తో ఎందుకు చర్చలు జరిపిందని రాహుల్ ప్రశ్నించారు. అనిల్ అంబానీ కంపెనీకి రూ. 30వేల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు.